
ఇంటర్నెట్ డెస్క్: పాదచారుల భద్రతకు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. నిర్దేశించిన ఫుట్‌పాత్‌పై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్‌పాత్‌లపై నడిచే వారికే అధిక ప్రాధాన్యత ఉంటుందని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూకర్లతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
పాదచారుల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. రహదారులు ఉన్నచోట కాలిబాటను (Footpath) గుర్తించి.. మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణ చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఉందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
సురక్షితమైన, సౌకర్యవంతమైన కాలిబాటలు లేకపోవడం, ఒకవేళ అవి ఉన్నప్పటికీ వాహనాలు వాటిని ఆక్రమించుకోవడం అనేది ఓ నాగరికత సమస్యగానే మిగిలిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షితంగా నడిచే హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు.. నష్ట పరిహారం కోసం సంబంధిత విభాగాలపై న్యాయపరంగా చర్యలు తీసుకునే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేసింది.
టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం సరైందే.. పిటిషన్ కొట్టేసిన దిల్లీ హైకోర్టు కొంతకాలం క్రితం తండ్రితో కలిసి ఓ బాలుడు పాఠశాలకు వెళ్తుండగా వెనుక నుంచి ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పాదచారుల మార్గంలో లోపాలున్నాయని, పరిహారం అందించాలని కోరుతూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పరిహారం చెల్లింపు అంశం సుప్రీం కోర్టుకు చేరడంతో ఈ కేసును విచారించిన ధర్మాసనం.. పాదచారుల భద్రతపై కీలక తీర్పు ఇచ్చింది. అంతేకాదు, మృతిచెందిన బాలుడి కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.11,44,628కి పెంచుతూ.. రెండు నెలల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించింది.
లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు