
ఇంటర్నెట్ డెస్క్: ఆమె గజ్జెకట్టి రంగస్థలంపై అడుగుపెడితే ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతారు. లయబద్ధంగా పాదాలు కదిపితే చూసే ప్రతి ఒక్కరూ ఉర్రూతలూగుతారు. జానపద కథలను, పౌరాణిక గాథలను కళ్లకు కట్టేలా చెబుతుంటే చెవులు రిక్కించి వింటారు.
మరాఠీ సంప్రదాయ కళ ‘లవానీ’ని అభినయిస్తూ, ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమె పేరు విఠాబాయి భావూ. ఇప్పుడు ఆమె జీవిత కథతో ‘ఈఠా’(eetha) చిత్రం రూపొందుతోంది. హారర్ కామెడీ చిత్రాలు ‘స్త్రీ’, ‘స్త్రీ 2’లతో అలరించిన శ్రద్ధా కపూర్(shraddha kapoor) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
గతేడాది ‘ఛావా’తో ఘన విజయాన్ని అందుకున్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రద్ధ పాత్రకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరాఠీ సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఆ గెటప్నకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.
రక్షాబంధన్ కానుకగా ఆగస్టు 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.