
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. TTD September 2026 Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ జూన్ 18న ప్రారంభమైంది.
ఈ లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులకు కేవలం రూ.120కే మొదటి గడప నుంచి స్వామివారిని అత్యంత సమీపంగా దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తుంది. లక్కీ డిప్ ముఖ్యమైన తేదీలు ఈ లక్కీడిప్ నమోదుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వగా..
జూన్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు వరకు మాత్రమే భక్తులకు రేపు లాస్ట్ ఛాన్స్ ఉండనుంది. జూన్ 20 మధ్యాహ్నం విజేతల వివరాలను టీటీడీ ప్రకటిస్తుంది. ఎంపికైన వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. లక్కీ డిప్లో పేరు వచ్చిన భక్తులు జూన్ 20 నుండి జూన్ 22 మధ్యాహ్నం 12 గంటల లోపు ఆన్లైన్లో నిర్ణీత రుసుము చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
గమనిక: సాధారణంగా మొదటి గడప దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలను కేవలం రూ. 120 ప్రారంభ ధరకే పొందే వీలుండటంతో భక్తులు దీనిపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు.
భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇతర సేవా టికెట్ల విడుదల
షెడ్యూల్ లక్కీ డిప్ సేవలతో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన మిగతా దర్శన కోటాలను కూడా టీటీడీ వరుసగా విడుదల చేయనుంది. తిరుమలలో ఇతర ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను బుకింగ్ చేసేందుకు జూన్ 22 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
అలాగే జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లు రిలీజ్ చేస్తుండగా.. జూన్ 23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, అలాగే వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టోకెన్లు విడుదలవుతాయి. ఆ తర్వాత జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 విలువైన స్పెషల్ దర్శనం టికెట్లను బుక్ చేయోచ్చు. అదే విధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబరు నెలలో దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు రూమ్ బుకింగ్ అందుబాటులో ఉండనుంది. శ్రీవారి సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, గడువులోగా తమ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.