
Telangana rainfall deficit: రాష్ట్రం రుతుపవనాలు విస్తరిస్తున్న నేపధ్యంలో తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. వర్షాలు కురవకపోగా, సాధారణం కంటే మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి.
మృగశిర కార్తెలో కురిసే వర్షాలతో ఆరుతడి వంటల సాగులో బిజీగా ఉండాల్సిన రైతులు వలు జిల్లాల్లో తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం రాష్ట్ర మొత్తం మీద సగటున -27 శాతం మేర లోటు వర్షపాతం చోటు చేసుకుంది.
వానాకాలం సీజను ప్రారంభమైన ఈ నెల 1వ తేదీ నుండి గురువారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 72.1 మిల్లీ మీటర్ల మేర సాధారణ వర్షం నమోదుకావాల్సి ఉండగా, 52.8 మిల్లీ మీటర్లు మాత్రమే చోటు చేసుకుంది. Read Also: El Nino impact: ఎల్‌నినో దెబ్బ..
భారత్‌లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం రాష్ట్రంలోని కేవలం 3 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే మించి అధిక వర్షపాతం రికార్డయింది. 6 జిల్లాల్లో ఒక్క చుక్క వర్షం కూడా కురవకపోవడంతో భారీ లోటు నమోదైంది. మరో 14 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ కురియడంతో అవి కూడా లోటులో ఉన్నాయి.
అయితే మిగిలిన 10 జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ వానాకాలం సీజను ప్రారంభమైనప్పటి నుండి గురువారం వరకూ రాష్ట్రంలోనే హన్మకొండ జిల్లాలో అత్యధికంగా -80 శాతం లోటు వర్షపాతం నమోదయింది, పెద్దపల్లి జిల్లాలో -71 శాతం, సిద్ధిపేట్ జిల్లాలో 66 శాతం, జగిత్యాల జిల్లాలో -65 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో -64 శాతం, మహబూబాబాద్ జిల్లాలో -60 శాతంతో భారీ లోటు వర్షపాతంతో కొట్టుమిట్టాడుతున్నాయి.
అలాగే వరంగల్ జిల్లాలో 56 శాతం, నిజామాబాద్‌లో 55 శాతం, జనగామలో -54 శాతం, భూపాలపల్లి, మంచిర్యాలలో -52 శాతం, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 50 శాతం, మల్కాజిగిరి -45 శాతం, సిరిసిల్ల లో
-44 శాతం, నిర్మల్‌లో -42 శాతం, భువనగిరిలో -40 శాతం, కామారెడ్డిలో 39 శాతం, ములుగులో -34 శాతం, మెదక్ జిల్లాలో -20 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది.
అయితే రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో సాధారణం కంటే మించి అత్యధికంగా 48 శాతం, రంగారెడ్డి జిల్లాలో 39 శాతం, ఖమ్మం జిల్లాలో 25 శాతం మేర సాధారణం కంటే మించిన అధిక వర్షపాతం చోటు చేసుకుంది. మరోవైపు ఉత్తరాది వైపు నుంచి వస్తున్న వడగాలుల తీవ్రత కారణంగా రాష్ట్రంలోని 246 మండలాల్లో వాతావరణ కేంద్రం వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. గడచిన 24 గంటల్లో, రాష్ట్రంలోని సూర్యాపేట్ మామిళ్లగూడెంలో గరిష్ట ఉష్ణోగ్రత 43.6 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోగా, 30 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
NEET-UG 2026 : టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana water crisis: వానలు రాలె.. నీళ్లు లేవాయె!.. ప్రమాదకర స్థాయిలో జలాశయాల నీటి నిల్వలు
Bhadradri Incident: ఘోరం.. కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు.. తల్లి బిడ్డ మృతి
El Nino impact: ఎల్‌నినో దెబ్బ.. భారత్‌లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం
Rahul Gandhi Birthday: రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
New Ration Cards: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అప్లై చేసుకోండిలా
Gold Rate Today: నేటి బంగారం ధరలు.. 10 గ్రాములకు ఎంతంటే?