
ఇంటర్నెట్ డెస్క్: ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రాఖ్’ (Raakh Webseries)లో తన నటనకు ప్రశంసలు అందుకుంటోంది సీనియర్ నటి సోనాలీ బింద్రే (Sonali Bendre). ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
సిరీస్ చిత్రీకరణ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. సిరీస్‌లో ఎక్కువగా మాటల్లేకుండా నటించడం సులభంగా అనిపించినా, ఆ పాత్రలోని ప్రభావం మాత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా తనను వెంటాడిందని చెప్పారు. ‘‘నాకు అద్భుతమైన కంటెంట్ ఇచ్చారు.
గతంలో అయితే ఒక పేజీ మొత్తం చదివి డైలాగ్స్ గుర్తుంచుకోగలిగేదాన్ని, కానీ ఇప్పుడు నా జ్ఞాపకశక్తి గతంలోలా లేదు. పేజీల కొద్దీ డైలాగ్స్ గుర్తుంచుకోవడం కష్టం. అందుకే ఈ సిరీస్‌లో నాకు ఎక్కువగా డైలాగ్స్ లేకపోవడం ఫన్‌గా అనిపించింది.
కానీ, డైలాగ్స్ లేని పాత్రల్లో వేరే సవాల్ ఉంటుంది. మాటలు లేనప్పుడు అంతా అంతర్గతంగా పలికించాలి. అది మరింత వాస్తవికంగా ఉంటుంది. ఆ పాత్రను నాలో అంతర్లీనం చేసుకోవడం వల్ల షూటింగ్ పూర్తిచేసుకొని ఇంటికి వచ్చాక కూడా ఆ పాత్ర ప్రభావం నుంచి బయటపడటం కష్టంగా అనిపించింది’’ అని సోనాలీ గుర్తు చేసుకున్నారు.
ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. సోనాలీ బింద్రే, ఆమిర్ బషీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.