నల్ల నువ్వుల్లో కాల్షియం, కాపర్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు నల్లగా ఉండేందుకు సహాయపడే మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా జుట్టు నెరిసిపోకుండా కాపాడుతాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ పేర్కొంది. కోడిగుడ్లలో విటమిన్ బి7 (బయోటిన్), బి12తో పాటు ఐరన్, ప్రోటీన్ వంటి ఆవశ్యక పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
రోజూ రెండు కోడిగుడ్లు తినడం ద్వారా జుట్టు హెల్తీగా ఉంటుంది. తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. మెంతి ఆకులు, మునగాకు, పాలకూర, తోటకూర, కాలే వంటి ఆకుకూరలు తినడం ద్వారా ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు అందుతాయి. ఇవి కుదుళ్లకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ రవాణా మెరుగుపరుస్తాయి.
జుట్టు నెరిసిపోకుండా కాపాడుతాయి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, రాజ్మా, శనగలు, పల్లీలు వంటి పప్పులు, బీన్స్‌లో ప్రోటీన్, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు తెల్లబడకుండా కాపాడుతాయి. బాదం, వాల్నట్స్, గుమ్మడి, పొద్దు తిరుగుడు, అవిసె గింజల్లో విటమిన్ ఇతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఫ్రీ రాడికల్స్ నుంటి జుట్టును కాపాడుతాయి. తెల్ల జుట్టు సమస్య నివారిస్తాయి. సాల్మోన్, మాకరెల్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్ తినడం ద్వారా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి అందుతాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కుదుళ్లు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.
జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు నల్లగా ఉండేందుకు సహాయపడతాయి. తద్వారా తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చు.
అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టు తెల్లబడటం నివారిస్తాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కుదుళ్లలో సెబమ్ ఉత్పత్తిని పెంచి జుట్టు నల్లగా ఉండేందుకు సహాయపడుతుంది.
జుట్టు సమస్యలను నివారిస్తుంది.
జుట్టు రాలడం, తెల్ల