తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
చెన్నై, జూన్ 19: కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. డ్యామ్ నిర్మాణంతో కావేరి డెల్టా రైతులకు తీవ్రనష్టం కలుగుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది.
గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని వినతి పత్రం సమర్పించారు. కావేరి నిర్వాహక మండలిలో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆమోదం లేకుండా మేకెదాటు ప్రాజెక్టును చేపట్టడానికి వీలులేదని, ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర నీటి వనరులకు శాఖకు ఆదేశాలివ్వాలని మోదీని కోరారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
కర్ణాటక ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్ట్ కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డుతో పాటు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులు సహా ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అనుమతులూ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి కాంగ్రెస్, వీసీకే, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు