కోడి గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, ఐరన్, జింక్, సెలీనియం ఎక్కువగా లభిస్తుంది. ఇవి జుట్టును మూలాల నుంచి దృఢంగా మార్చుతాయి. గుడ్లు తింటే జుట్టు బాగా పెరుగుతుందని మయో క్లీనిక్ నివేదిక తెలిపింది. పాలకూరలో ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఎ, కెలు పుష్కలంగా లభిస్తాయి.
ఇవి జుట్టు రాలడాన్ని అదుపు చేస్తాయి. పాలకూర తింటే జుట్టు ఒత్తుగా మారుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి జుట్టు పెరగడానికి సాయపడతాయి. బాదంలో బయోటిన్, మెగ్నీషియం, జింక్‌తో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
ఇవి జుట్టును ఒత్తుగా మార్చుతాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్ డి ఎక్కువగా లభిస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుతాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి5, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి. క్యారెట్ తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.
ఇందులో బయోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం కూడా లభిస్తుంది. అవకాడో తింటే జుట్టు పొడవుగా పెరుగుతుంది. బెర్రీస్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే జుట్టు రాలడం తగ్గుతుంది
.