
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయులు జమ చేసిన నిధులు ఎనిమిది శాతం మేర తగ్గి 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (సుమారు రూ.36,793 కోట్లు)కు చేరాయి.
స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సేవల సంస్థల భారత ప్రజలు, సంస్థల డబ్బుల జమ 2024తో పోలిస్తే దాదాపు 15 శాతం తగ్గడమే ఇందుకు కారణం. నేరుగా భారత ప్రజలు, సంస్థల ఖాతాల్లోని డిపాజిట్లు మాత్రం 50 శాతానికి పైగా పెరిగి 524 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (సుమారు రూ.6,000 కోట్లు)కు చేరాయి. అయితే.. మొత్తం డబ్బులో ఇది 16 శాతం మాత్రమే. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన వార్షిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
2025లో స్విస్ బ్యాంకుల్లోని మొత్తం విదేశీ నిధులు కూడా ఎనిమిది శాతం తగ్గి 1.05 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పడిపోయాయి. నిధుల పరంగా భారత్ 46వ స్థానంలో ఉంది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 81వ, పాకిస్థాన్ 108వ స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు మూడింతలకు పైగా పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (సుమారు రూ.37,600 కోట్ల)కు చేరాయి. మొత్తంగా చూస్తే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు అత్యధికంగా 2006 ఏడాదిలో దాదాపు 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల మధ్య అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సరికొత్త విశ్లేషణ చేశారు.