
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Venomous Snake hiding on Scooty Video goes Viral: ఇటీవల కోబ్రాలు అడవులు, పుట్టల్లో కంటే జనావాసాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో పాములు ఇంట్లో గుబురుగా చెట్లు ఉంటే లేదా ఎలుకలు, కప్పలు ఉన్న చోట ఎక్కువగా హల్ చల్ చేస్తాయి.
ఒకప్పుడు చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చే వారు. కానీ ఇప్పుడు మాత్రం వాటితో ఫోటోలు రీల్స్ కూడా చేస్తున్నారు. అవి కూడా వారికి సహకరిస్తున్నాయి. ఈ క్రమంలో పాములు ఇటీవల షూస్ లు, స్కూటీలు, కార్లలో కూడా దూరి దాక్కుంటున్నాయి.
చీకటిగా ఉండే ప్రదేశాల్లో పాములు ఎక్కువగా ఉండేందుకు ఆసక్తిని చూపిస్తాయి. అందుకు ఇంటి చుట్టు చెత్తా చెదారం, పనికి రాని వస్తువులు ఉంచుకొవద్దని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక కోబ్రా ఏకంగా స్యూటీ డిక్కిలో దూరి హల్ చల్ చేసింది.
పాపం.. ఆ వాహన దారులు డిక్కీలో తోక కన్పించడంతో అనుమానంతో రోడ్డుపక్కన ఆపిచూడగా భారీ సర్పంబైటకు వచ్చి బుసలు కొట్టింది. డిక్కీ మెల్లగా ఓపెన్ చేయగానే ఒక భారీ నాగు పాము దాన్నుంచి బైటకు వచ్చింది. అది కోపంతో బుసలు కొడుతూ స్కూటీ వెనకాల కూర్చుంది.
దగ్గరికి వస్తే కాటేస్తా అన్నట్లు అక్కడున్న వారిని భయపెట్టింది. ఇంతలో అక్కడున్న వారు పాముల్ని పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అతను అక్కడకు వచ్చి కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది మాత్రం పలు మార్లు స్నేక్ క్యాచర్ పై దాడికి ప్రయత్నించింది.
Read more
: Snake Video: ఇదెక్కడి మాస్ రా మావా.. పాము కళ్లలో కళ్లు పెట్టి కసితీరా ముద్దాడుతున్న యువతి.. వీడియో వైరల్..
అక్కడున్న వారు తమ ఫోన్ లలో పాము కదలికల్ని రికార్డు చేశారు.ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఏంట్రా ఈ పాము ఇలా స్కూటీ ఎక్కిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.