
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. FIFA World Cup 2026 Highlights: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎల్ లో జరిగిన పోరులో ఘనా సంచలన విజయం సాధించింది. టొరంటో వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో పనామా డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఎక్స్ట్రా టైమ్‌లో ఘనా కొట్టిన ‘విన్నింగ్ గోల్’ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
పనామాపై 1-0 తేడాతో ఘనా నెగ్గిన ఈ మ్యాచ్‌లో.. 20 ఏళ్ల యువ సంచలనం కాలేబ్ యిరెంకీ హీరోగా మారాడు. ఆట జరిగిన 90 నిమిషాల పాటు రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో ఒక్క గోల్ కూడా కూడా నమోదు కాలేదు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు అటాకింగ్ గేమ్ మొదలుపెట్టాయి.
పనామా డిఫెండర్లు ఘనా ఫార్వర్డ్ ఆటగాళ్లను సమర్థవంతంగా అడ్డుకోగా.. ఘనా గోల్ కీపర్ కూడా పనామా స్ట్రైకర్ల ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి స్కోరు బోర్డు 0-0తో నిలిచింది. మ్యాచ్ ఫలితం కోసం కేటాయించిన ఎక్స్ట్రా టైమ్‌లో ఘనా వ్యూహాన్ని మార్చింది.
పనామా హాఫ్ కోర్టుపై ఒత్తిడి పెంచుతూ కౌంటర్ అటాక్‌కు దిగింది. ఈ క్రమంలోనే బాక్స్ వెలుపల నుంచి అందిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న యువ మిడ్‌ఫీల్డర్ కాలెబ్ యిరెంకీ.. పనామా డిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు.
పనామా గోల్‌కీపర్ బంతి మూవ్‌మెంట్‌ను అంచనా వేసేలోపే.. బంతి గోల్ పోస్ట్‌ను తాకింది. దీంతో ఎక్స్ టైమ్ టైమ్‌లో ఘనా గోల్ సాధించి.. విజయాన్ని గెలుపు సొంతం చేసుకుంది. ఘనా టీమ్‌కు గెలుపును అందించిన కాలేబ్ యిరెంకీ జీవితం
ఎందరికో ఆదర్శం. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఎక్స్ట్రా టైమ్‌లో గోల్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన (20 ఏళ్లు) ఫుట్‌బాలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుత గోల్‌తో రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్‌గా మారాడు. కాలెబ్ యిరెంకీ జీవితం వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. కాలెబ్ తండ్రి ఒక సాధారణ కార్పెంటర్. ఒక చిన్న ఫర్నిచర్ షాపులో రోజువారీ కూలీగా పనిచేసే ఆయన.. మ్యాచ్‌కు ముందే తన కొడుకు పోస్టర్‌ను ఆ షాప్ బయట పెట్టి గర్వంగా అందరికీ చూపించాడు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. వరల్డ్ కప్ వేదికపై మ్యాచ్ విన్నింగ్ గోల్ కొట్టి ఘనా దేశానికే కాకుండా.. తన తండ్రికి కాలెబ్ మరపురాని బహుమతిని ఇచ్చాడు. పనామాపై ఘనా విజయం సాధించడంతో టొరంటో వీధుల్లో భారీ సంఖ్యలో ఘనా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.