
AP Crime: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. కంకిపాడు మండలం గోశాల గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కేవలం స్థలం వివాదం కారణంగా అల్లుడే కాలయముడిగా మారి తన సొంత మామను దారుణంగా హత్య చేశాడు.
Read also: Medchal Tragedy: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి పోలీసులు, స్థానికులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. గోశాల గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు (65)కు, అతని అల్లుడికి మధ్య కొంతకాలంగా ఒక స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తోంది.
ఈ విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలోనే గురువారం మరోసారి ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అల్లుడు.. క్షణికావేశంలో మామ సాంబశివరావుపై ఘోరంగా దాడి చేసి హతమార్చాడు. తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. సాంబశివరావు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడైన అల్లుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది. Vizianagaram crime: మహిళ ప్రాణాలు బలి తీసుకున్న పోలీసుల వేధింపులు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. BIEAP supply results 2026: AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి LIC Bhima Sakhi Scheme
: శుభవార్త.. LIC ‘బీమా సఖి’ పథకంతో నెలకు 7 వేల ఆదాయం
AP Weather updates: ఏపీలో నేడు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ
AP EAMCET 2026 Results: AP EAMCET 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ చెక్ చేసే లింక్ ఇదే!
Tadipatri Yogandhra 2026: తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా యోగాంధ్ర-2026 కార్యక్రమం!