
నభా నటేశ్ (Nabha Natesh)కు తొలి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. అలా హిట్టిచ్చాడు కాబట్టి అతడంటే ఇష్టం కాదంటోంది నభా నటేశ్. పూరి జగన్నాధ్ వ్యక్తిత్వం, ఆయన ఫిలాసఫీ అంటే తనకు పిచ్చి అని చెబుతోంది. నిజజీవితంలో పూరి జగన్నాధ్ ను నూటికి నూరు శాతం ఫాలో అవుతుందంట నభా.
నిజజీవితంలో ప్రాక్టికల్ గా బతికడమంటే ఏంటో పూరి జగన్నాధ్ ను చూసి నేర్చుకున్నానంటోంది నభా నటేష్. “చాలామంది గతం గురించి తలుచుకొని బాధపడతారు. కొంతమంది భవిష్యత్ పై ఆందోళనగా ఉంటారు. కానీ పూరి జగన్నాధ్ మాత్రం ఈ క్షణం మాత్రమే నీదని చెబుతుంటారు.
ఆయన అలానే బతుకుతాడు. అదే నేను కూడా అలవాటు చేసుకున్నాను.” గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తీసుకురాలేమని, ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకుంటే, ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా గడపొచ్చని చెబుతోంది నభా నటేశ్. పూరి జగన్నాధ్ పాడ్ కాస్ట్ అన్నా కూడా ఈమెకు చాలా ఇష్టమంట.
ఆయన నుంచి ఒక పాడ్ కాస్ట్ ఇలా వచ్చిందంటే చాలు వెంటనే దాన్ని చూస్తుందంట. వీలైతే నిజజీవితంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తుందంట. హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు పూరి జగన్నాధ్ నే ఎక్కువగా కలవడానికి తాను ఇష్టపడతానంటోంది నభా నటేశ్
.