
Radhika Merchant: బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్. రెండు సంవత్సరాలు క్రితమే రాధిక మర్చంట్.. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంది. అయితే..
అనంత్ తో పెళ్లికి ముందు అమెరికాలో తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. కానీ.. సడెన్ గా అమెరికా వదిలేసి... ఇండియాలో సెటిల్ అవ్వడానికి గల కారణాన్ని ఇటీవలే రాధిక బయట పెట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాధిక న్యూయార్క్ యూనివర్శిటీలో తన చదువు పూర్తి చేసుకుంది.
ఆ తర్వాత అక్కడే తన కెరీర్ ని కంటిన్యూ చేయాలని ఆశ పడింది. కానీ... తాను యూఎస్ లో చదువుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాను గుర్తించింది. ఆ సమయంలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయట.రాజకీయంగా, స్థానికంగా అక్కడ గందరగోళం ఏర్పడిందని..
అక్కడ ఉంటే కెరీర్ సవ్యంగా సాగదు అనే భయం ఒకవైపు, ఆ సమయంలో భారత్ మరింత ఎక్కువ అభివృద్ధి చెందుతోందని అనే నమ్మకంతో.. యూఎస్ లో కెరీర్ వదిలేసుకున్నాను అని రాధిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ‘ ఆ సమయంలో భారతదేశంలో బీజేపీ కి బలమైన సపోర్ట్ ఉంది.ఆధార్, యూపీఐ, జియో వంటి డిజిటల్ ఉప్లవాలు దేశానికి కొత్త దిశ ఇచ్చాయి.
అందుకే యూఎస్ కంటే ఇండియాకి రావడం బెటర్ అని భావించాను. అంతేకాకుండా ఆ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 8.5శాతం ఉండేది. అమెరికా కంటే భారత్ కి ఎక్కువ సామర్థ్యం ఉందని అనిపించింది. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వచ్చినప్పుడు మాడిసన్ స్క్వేర్ పార్క్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను.
అప్పుడే భారత్ దేశానికి వచ్చేయాలి అనే ఆలోచన వచ్చింది ’ అని రాధిక చెప్పారు. ‘ నేను భారతదేశానికి తిరిగి రావాలనే కోరిక
కేవలం కెరీర్, ఆర్థిక అవకాశాల కోసం మాత్రమే కాదు, దేశానికి ఏదైనా బాధ్యతగా చేయాలనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని రాధిక చెప్పారు. అంతేకాకుండా.. ఇదే కార్యక్రమంలో అమ్మాయిలు ఆర్థికంగా స్వాతంత్రంగా ఎందుకు ఎదగాలి? అది ఎంత అవసరం అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అమ్మాయిలు డబ్బు విషయంలో ఎవరి మీదా ఆధారపడకూడదని..ఎవరి కూతురు? ఎవరి భార్య అని కాకుండా.. మీకంటూ మీరు గుర్తింపు సంపాదించుకోవాలి అని రాధిక అన్నారు.