
ఫిఫా ప్రపంచకప్2026లో కొలంబియా శుభారంభం చేసింది. గ్రూప్- ‘కె’లో భాగంగా ఉజ్బెకిస్థాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్2026లో కొలంబియా శుభారంభం చేసింది. గ్రూప్- ‘కె’లో భాగంగా ఉజ్బెకిస్థాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది.
తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉజ్బెకిస్థాన్ 3-1 తేడాతో కొలంబియా చేతిలో ఓటమి చవిచూసింది. మెక్సికోలోని ఎస్టాడియో అజ్టెకా వేదికగా కొలంబియా, ఉజ్బెకిస్థాన్ జట్లు తలపడ్డాయి. లూయిస్ డియాజ్ ఇచ్చిన పాస్‌ను 40వ నిమిషంలో డానియల్ మునోజ్ గోల్‌గా చేయడంతో కొలంబియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అయితే, ఆ తర్వాత రెండో అర్ధ భాగంలో ఉజ్బెకిస్థాన్ 60వ నిమిషంలో కొట్టి సంచలనం నమోదు చేసింది. అబోస్బెక్ ఫేజులేవ్ ఉజ్బెకిస్థాన్ తరఫున ప్రపంచకప్‌లో తొలి గోల్ చేసిన అరుదైన ఘనత సాధించాడు. గోల్ చేసిన సంతోషం మాత్రం ఉజ్బెకిస్థాన్‌కు ఎంతో సేపు నిలవలేదు.
డియాజ్ 65వ నిమిషంలో గోల్ కొట్టి కొలంబియాను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. జామిన్టన్ క్యాపేజ్ అదనపు సమయంలో మరో గోల్ కొట్టి కొలంబియా విజయాన్ని ఖరారు చేశాడు. మరో మ్యాచ్‌లో పనామాపై ఘనా విజయం సాధించింది. కెనడాలోని టొరంటో వేదికగా గ్రూప్-‘ఎల్’లో భాగంగా పనామాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఘనా గెలుపొందింది.
అదనపు సమయంలో కలేబ్ యిరెంకి గోల్ కొట్టి ఘనాను గెలిపించాడు. జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ డబుల్ సెంచరీ మిస్ కావడంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు