
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. AP Inter Supply Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు(AP Inter Supply Results) విడుదలయ్యాయి.
విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్సైట్ల ద్వారా, అలాగే వాట్సాప్ 'మనమిత్ర' (9552300009) నంబర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది రెండో ఏడాది విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయం కల్పించడంతో మొత్తం 1.83 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు.
గతంలో అనుత్తీర్ణులైన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షల ద్వారా ఉత్తీర్ణత సాధించి తమ విద్యా ప్రయాణాన్ని కొనసాగించే సువర్ణావకాశాన్ని పొందారు. Anant Ambani: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ.. ఆలయానికి రూ.48 కోట్ల భారీ విరాళం ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ రాసిన 2,29,034 మందిలో 59% (1,35,435 మంది), సప్లిమెంటరీ రాసిన 1,09,003 మందిలో 39% (42,379 మంది) ఉత్తీర్ణత సాధించారు.
అలాగే ద్వితీయ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ రాసిన 91,303 మందిలో 53% (48,149 మంది), సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1,02,018 మందిలో 56% (57,327 మంది) విద్యార్థులు విజయం సాధించి తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు
.