
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
england vs croatia: ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీలో గ్రూప్-L మొదటి మ్యాచ్‌లోనే ఫుట్‌బాల్ ప్రియులకు అసలైన మజా లభించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో క్రొయేషియాపై 4-2 తేడాతో ఇంగ్లాండ్ సంచలన విజయం సాధించింది.
2018 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌తో పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది. మొత్తం 6 గోల్స్ నమోదైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ రెండు గోల్స్‌తో చెలరేగగా, యువ తారలు జూడ్ బెల్లింగ్‌హామ్, మార్కస్ రాష్‌ఫోర్డ్ చెరొక గోల్‌తో ఇంగ్లాండ్‌కు 3 పాయింట్లు తెచ్చిపెట్టారు.
మ్యాచ్ 12వ నిమిషంలోనే తీవ్ర నాటకీయత చోటుచేసుకుంది. క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిక్ ఒత్తిడిలో నోని మడుయెకేను కింద పడేయడంతో రిఫరీ ఇంగ్లాండ్‌కు పెనాల్టీ ఇచ్చాడు. హ్యారీ కేన్ కొట్టిన మొదటి కిక్‌ను క్రొయేషియా కీపర్ లివాకోవిచ్ అడ్డుకున్నప్పటికీ..
కిక్కు ముందే డిఫెండర్ జోస్కో గార్డియోల్ డి-ఏరియాలోకి రావడంతో రిఫరీ మళ్లీ అవకాశం ఇచ్చాడు. ఈసారి కేన్ ఎలాంటి తప్పు చేయకుండా బంతిని గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 36వ నిమిషం: లూకా సుకిచ్ అద్భుతమైన డ్రిబ్లింగ్‌తో ఇంగ్లాండ్ డిఫెన్స్‌ను ఛేదించి ఇచ్చిన పాస్‌ను మార్టిన్ బటురినా గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేశాడు.
42వ నిమిషం : డెక్లాన్ రైస్ వేసిన పర్ఫెక్ట్ కార్నర్ కిక్‌ను హ్యారీ కేన్ గాల్లోకి లేచి సూపర్ హెడర్‌తో గోల్ చేసి ఇంగ్లాండ్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. ఫస్ట్ హాఫ్ ఇంజూరీ టైమ్ : హాఫ్ టైమ్‌కు ముందే ఇంగ్లాండ్ డిఫెన్స్ పొరపాటును వాడుకున్న పీటర్ మోసెస్ఒక అద్భుతమైన వాలీ షాట్‌తో గోల్
కొట్టి స్కోరును 2-2తో మళ్లీ సమం చేశాడు.
సెకండ్ హాఫ్ లో ఇంగ్లాండ్ మరింత దూకుడు పెంచింది. 47వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ డిగువ-ఎడమ మూలలోకి బంతిని పంపి ఇంగ్లాండ్‌కు 3-2 ఆధిక్యాన్ని ఇచ్చాడు.
ఇక 85వ నిమిషంలో బుకాయో సాకా అందించిన తెలివైన పాస్‌ను అందుకున్న మార్కస్ రాష్‌ఫోర్డ్ ఏమాత్రం కంగారు పడకుండా క్రొయేషియా కీపర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా క్లాసిక్ ఫినిషింగ్‌తో నాల్గో గోల్ (4-2) సాధించాడు. ఇదే మ్యాచ్ విన్నింగ్ గోల్‌గా నిలిచింది. 198 క్యాప్స్‌తో తన 5వ వరల్డ్ కప్ ఆడుతున్న లూకా మోడ్రిచ్ సేనకు.. కేన్, బెల్లింగ్‌హామ్ జోడి కోలుకోలేని షాకిచ్చింది. కెప్టెన్‌గా కేన్ అనుభవం, యువ ఆటగాళ్ల వేగం ఇంగ్లాండ్‌ను టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా నిలబెట్టాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.