
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Vishakha tilkar commits suicide 48 days after of marriage in maharashtra: ఇటీవల కాలంలో భార్యభర్తలకు హత్యలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా ఒకర్నిమరోకరు హత్యలు చేసుకుంటున్నారు.
కట్నం ఇవ్వలేదని, భర్త ఎక్కువగా డబ్బులు సంపాదించడంలేదని ఇతరులతో పొల్చుకుంటూ తమ కాపురాలను బజారున పడేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న వారిని సుపారీలు ఇచ్చి మరీ కాటికి పంపుతున్నారు.
ఇలాంటి ఘటనలతో పెళ్లి అనే పవిత్ర బంధంకు బీటలు వారుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై దగ్గరలో ఉన్న అంబర్ నాథ్ లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అంబర్‌నాథ్‌లో పెళ్లైన 48 రోజులకే నవవధువు విశాఖ తిల్కర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విశాఖ తిల్కర్ (26)కు, వైద్యుడైన నితిన్ తిల్కర్ కు ఈ ఏడాది ఏప్రిల్ 30న ఘనంగా పెళ్లి జరిపించారు. భారీ ఎత్తున కట్నకానుకలు ఇచ్చి మరీ పెళ్లి గ్రాండ్ గా చేశారు. అంత బాగుంది.. ఇక అత్తాగారింట్లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ వధువుకు తొలి రాత్రి నుంచి ఊహించని షాక్ లు ఎదురయ్యారు.
పెళ్లి తర్వాత భర్త, అత్తింటి వారు తమ అసలు స్వరూపం బైటపెట్టారు. తమ కొడుకు వైద్యుడని ఇంకా పెద్దింటి సంబంధాలు వస్తాయని భారీగా కట్నకానుకలు వస్తాయని కొత్త కోడల్ని వేధించడం మొదలు పెట్టారు. అంతే కాకుండా నిరంతరం విశాఖ తిల్కర్ ఎవరితో మాట్లాడుతుంది..
ఇంట్లో, ఇంటి చుట్టు, బెడ్ రూమ్, కిచెన్, బాల్కనీ, చివరకు బాత్రూమ్ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రోజు డ్యూటీ నుంచి వచ్చాక ఎవరితో మాట్లాడినట్లు కన్పించిన భార్యపై అనుమానంతో వేధించేవాడు. దీనికి తోడు ఇటీవల అత్తా, మామ కూడా భర్తతో కలిసి నవవధువును కొట్టడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది.
తమకు బంగారం, నగదు కట్నంగా తెవాలని విశాఖ తిల్కర్ ను విపరీతంగా వేధించారు. దీంతో ఈ వేధింపులు భరించలేక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయంను విశాఖ తిల్కర్ చెప్పింది. వచ్చి తనను తీసుకెళ్లాలని కోరింది.ఆ తర్వాత ఏమైందో కానీ విశాఖ తిల్కర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆతర్వాత మహిళ పుట్టింటి వాళ్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Read more: CM Vijay Thalapathy: సీఎం విజయ్ దళపతి మరో సంచలనం.. ఏకంగా 14.43 లక్షల మంది రైతన్నలకు లబ్ధి.!.
మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త నితిన్ తిల్కర్, అత్త ఛాయా తిల్కర్, మరిది నినాద్ తిల్కర్లపై మానసిక, శారీరక వేధింపులు, వరకట్న వేధింపుల కింద కేసులను నమోదు చేశారు. ఈ క్రమంలో డాక్టర్ నితీన్ తిల్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం మహారాష్ట్రలో తీవ్ర విషాదకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఇంట్లో ఏంచేస్తుందని.. తెలుసుకొవడానికి