
మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. అయితే దీన్ని జీర్ణం చేసేటప్పుడు 'అమోనియా' అనే విష పదార్థం విడుదలవుతుంది. కాలేయం దీన్ని 'యూరియా'గా మార్చి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. కానీ, ప్రోటీన్ పౌడర్‌ను అధికంగా తీసుకుంటే లివర్ పై విపరీతంగా భారం పెరిగిపోతుంద.
దీని వల్ల కాలేయ కణాల్లో వాపు వస్తుంది. చాలా ప్రోటీన్ పౌడర్లలో రుచి కోసం, నిల్వ ఉండేందుకు కృత్రిమ స్వీటెనర్లు, ప్రిజర్వేటివ్‌లు వంటివి కలుపుతారు. కొన్నింటిలో సీసం, ఆర్సెనిక్ వంటి హానికర లోహాలు కూడా ఉన్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది.
ఇవి కాలేయంలో విషపదార్థాలను పెంచి, తీవ్రమైన హాని కలిగిస్తాయి. ఈ రోజుల్లో చాలామందికి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చేస్తోంది. ఇలాంటి వారు డాక్టర్ సలహా లేకుండా 'మాస్ గెయినర్' పౌడర్లను వాడితే, అప్పటికే బలహీనంగా ఉన్న కాలేయం మరింత వేగంగా దెబ్బతింటుంది.
సహజమైన ఆహారాన్ని పక్కనపెట్టి, కేవలం ప్రోటీన్ పౌడర్లనే ప్రధాన ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్ బి, కోలిన్, యాంటీ-ఆక్సిడెంట్లు అందవు. ఈ పోషకాల కొరత కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. శరీరం అదనపు ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసేటప్పుడు, కాలేయంలో 'ఫ్రీ రాడికల్స్' అనే హానికర అణువులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోకపోతే, ఈ ఒత్తిడి కాలేయ కణాలను దెబ్బతీసి, ఫైబ్రోసిస్ (గాయాలు)కు దారితీస్తుంది.ఒకేసారి ఒక స్కూప్ (సుమారు 20-25 గ్రాముల ప్రోటీన్) మాత్రమే వాడాలి. కాలేయ పనితీరు పరీక్ష (LFT): ప్రోటీన్ పౌడర్‌ను వాడేవారు ప్రతి 6 నెలలకు ఒకసారి 'లివర్ ఫంక్షన్ టెస్ట్' చేయించుకోవాలి.
అలసట, వికారం, కళ్లు/చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడకం ఆపి డాక్టర్‌ను సంప్రదించాలి
.