
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గూగుల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ జెమినీ ఏఐ మోడళ్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ శాస్త్రవేత్త, సంస్థ వైస్ ప్రెసిడెంట్ నోయామ్ షజీర్ ఓపెన్ఏఐలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం ఏఐ రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది.‘‘ఓపెన్ఏఐలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది.
అక్కడి ప్రతిభావంతమైన బృందంతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నా’’ అని షజీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఓపెన్ఏఐ ప్రారంభించినప్పటి నుంచి కలిసి పనిచేయాలని కోరుకున్న వ్యక్తుల్లో నోయామ్ ఒకరు.
పదేళ్ల తర్వాత అది సాధ్యమైంది’’ అని వ్యాఖ్యానించారు.ఏఐ ప్రపంచంలో అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన షజీర్ 2000లో గూగుల్‌లో చేరారు. సంస్థలో తొలి 100 మంది ఉద్యోగుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చాట్బాట్లు, లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల అభివృద్ధికి పునాది వేసిన 2017లో విడుదలైన ప్రసిద్ధ ‘Attention Is All You Need’ పరిశోధనా పత్రానికి ఆయన సహ రచయితగా ఉన్నారు.
ఈ పరిశోధననే నేటి చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ మోడళ్లకు మూలంగా భావిస్తారు.గూగుల్ నుంచి 2021లో బయటకు వచ్చిన షజీర్ తన సొంతంగా ‘Character.AI’ను స్థాపించారు. అనంతరం 2024లో దాదాపు 2.7 బిలియన్ డాలర్ల ఒప్పందంతో గూగుల్ ఆయనను తిరిగి సంస్థలోకి తీసుకొచ్చింది.
అయితే రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఆయన మళ్లీ గూగుల్‌కు వీడ్కోలు పలికారు.అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో గణితం, కంప్యూటర్ సైన్స్ చదివిన షజీర్ చిన్నప్పటి