
ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం నిరాశాజనకంగా ప్రారంభమైంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్ తర్వాత ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డోపై విమర్శల వర్షం కురుస్తోంది.
పోర్చుగల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న రొనాల్డో, తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక నీరసంగా కనిపించాడు. అంతర్జాతీయంగా 143 గోల్స్ చేసి రికార్డు సృష్టించిన ఈ దిగ్గజం ఆటతీరుపై ఒక్క మ్యాచ్‌తోనే పండితులు, అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలు అతడిని జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే స్థాయికి చర్చ చేరింది.ఈ తీవ్రమైన విమర్శల నేపథ్యంలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గతంలో రొనాల్డో గురించి చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సరిగ్గా ఇలాంటి విమర్శలనే తన కెరీర్లో ఎదుర్కొన్న కోహ్లీ, రొనాల్డో విషయంలో ప్రపంచాన్ని హెచ్చరిస్తూ పలు సందర్భాల్లో తన అభిమానాన్ని, మద్దతును చాటుకున్నాడు.2022లో ఖతార్ ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించినప్పుడు రొనాల్డో కన్నీటి పర్యంతమవ్వగా, కోహ్లీ స్ఫూర్తిదాయక సందేశాన్ని పోస్ట్ చేశాడు.
"ఏ ట్రోఫీ లేదా టైటిల్ కూడా ఈ క్రీడకు మీరు చేసిన సేవను, ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులపై మీరు చూపిన ప్రభావాన్ని తగ్గించలేదు. ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు పొందే అనుభూతిని ఏ టైటిల్ వివరించలేదు. అది దేవుడిచ్చిన వరం. ప్రతిసారీ తన పూర్తిస్థాయిలో హృదయంతో ఆడే వ్యక్తికి ఇది నిజమైన ఆశీర్వాదం.
క్రీడాకారులందరికీ మీరు నిజమైన స్ఫూర్తి. నా దృష్టిలో మీరే ఆల్ టైమ్