కోడిగుడ్డు తెల్లసొనలో కొద్దిగా తేనె కలిపి మీ ముఖానికి రాసుకోండి. 15 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే చర్మం టైట్‌గా ఉంటుంది. కాఫీ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకోండి.
20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోవడం ద్వారా చర్మం స్థితిస్థాపతక పెరుగుతుంది. చర్మం టైట్‌గా ఉంటుంది. మొక్కల నుంచి తయారు చేసే బాదం నూనె, ఆలివ్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, జోజోబా ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం బిగుతుగా మారుతుంది. గ్వు షా లాంటి ఫేషియల్ ఎక్సర్సైజ్ టూల్‌తో మసాజ్ చేయడం ద్వారా చర్మం స్థితిస్థాపకత బాగుంటుంది. చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే ఫేషియల్ యోగా చేయడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరాలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపర్చి చర్మం సాగిపోకుండా చూస్తుంది. తద్వారా చర్మం ఎల్లపుడూ యవ్వనంగా, బిగుతుగా ఉంటుంది. దీనికోసం తాజా అలోవెరాను ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మంచిది.
సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు చర్మాన్ని డ్యామేజ్ చేసే సాగిపోయేలా చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవడం చాలా అవసరం. చర్మం సాగిపోకుండా ఉండేందుకు తగిన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మీ ఆహారంలో ప్రోటీన్, విటమిన్ సి, ఇ ఉండేలా చూసుకోండి.
ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మా్న్ని బిగుతుగా ఉంచుతాయి. తగినంత వాటర్ తాగకపోతే చర్మం ముడతలు పడి సాగిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రోజూ 3-4 లీటర్ల వాటర్ తాగాలి. దీంతో చర్మం స్థితిస్థాపకత మెరుగుపడి చర్మం టైట్ అవుతుంది.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ద్వారా చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే తిన్న
ఆహారంలోని పోషకాలు శరీరం బాగా శోషించుకుని స్కిన్ హెల్తీగా, టైట్‌గా మారుతుంది. అందువల్ల రోజూ ఉదయం 30-40 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా మంచిది.