
విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను అధికారులు నియమించారు. విజయవాడ, జూన్ 18: నగరంలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసు విచారణాధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను అధికారులు నియమించారు. కేసుపై వస్తున్న ఆరోపణలు, ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న అనంతరం కనిపించకుండా పోయాడని.. అతడ్ని స్టేషన్లో లాకప్ డెత్ చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు(గురువారం) ఎస్పీ.. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించనున్నారు. విచారణలో భాగంగా పలువురు పోలీసు సిబ్బందిని ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘సాయికృష్ణ బతికి ఉన్నాడో లేదో’ తెలిపాలని కోరుతున్నారు.
తన బిడ్డ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సాయికృష్ణ మిస్సింగ్ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్తుపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి మరోసారి బుల్లెట్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి.. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు