
NEET : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచింది.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్వర్డ్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. గతంలో జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దు కాగా, సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న (ఆదివారం) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ రీ-టెస్ట్ జరగనుంది.
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై ఉన్న ఎగ్జామ్ సెంటర్ చిరునామా, రిపోర్టింగ్ సమయం మరియు నిబంధనలను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. Read Also : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..మహిళా నేత శకుంతల సరెండర్ గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టాయి.
పరీక్ష పత్రాల రవాణా కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) హెలికాప్టర్లను ఉపయోగించడం, పరీక్ష కేంద్రాల వద్ద సీసీటీవీ లైవ్ మానిటరింగ్, సోషల్ మీడియా నిఘా వంటి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా, తప్పుడు లీకేజీల ప్రచారాన్ని అడ్డుకోవడానికి టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై తాత్కాలిక ఆంక్షలు కూడా విధించారు.
మరోవైపు, విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీఏ కొన్ని కీలక మార్పులు చేసింది. పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచి మొత్తం 195 నిమిషాలు కేటాయించడమే కాకుండా, క్వశ్చన్ బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ చేసుకునే పేజీలను 2 నుంచి 4కు పెంచారు. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా పరీక్ష పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
Nino Impact AP Farming: ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష.. వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Dharmasthala Controversy: ధర్మస్థల వివాదంలో నా ప్రమేయం లేదు: ప్రకాశ్ రాజ్
Versova Beach : బీచ్ నే పడక గదిగా మార్చుకున్న నగరవాసులు..ఎందుకో తెలుసా ?
Rahul Gandhi: నీట్ పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
Supreme Court: సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు
Nishant Tomar: ఢిల్లీలో పోలీస్ జాబ్ వదిలి..ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్
Operation Kagar: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..మహిళా నేత శకుంతల సరెండర్
El