
Versova Beach : మహారాష్ట్రలో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడంతో ముంబై నగరవాసులు నరకం చూస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడం, దీనికి తోడు ముంబై వాతావరణంలో ఉండే విపరీతమైన తేమ (ఉక్కపోత) కారణంగా సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ముంబైలోని ప్రసిద్ధ వెర్సోవా (Versova) తీర ప్రాంత ప్రజలు వినూత్నమైన, బాధాకరమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. రాత్రి వేళల్లో ఇళ్లల్లో అస్సలు నిద్రపట్టకపోవడంతో, స్థానిక బస్తీలు (స్లమ్స్) మరియు నిరుపేద ప్రాంతాలకు చెందిన ప్రజలు నేరుగా వెర్సోవా బీచ్‌కే పయనమవుతున్నారు.
సముద్రం నుండి వచ్చే చల్లని గాలి కోసం రాత్రి పూట ఈ బీచ్‌నే తమ తాత్కాలిక పడకగదిగా మార్చుకుంటున్నారు. Read Also : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..మహిళా నేత శకుంతల సరెండర్ ఈ ప్రాంతంలో రాత్రి వేళల్లో ఉక్కపోత తీవ్రంగా ఉండటమే కాకుండా, తరచూ గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటం (Power Cuts) ప్రజల ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది.
ఇరుకైన గదులు, సరైన గాలి వెలుతురు లేని ఇళ్లల్లో ఉండలేక.. నిద్ర లేని రాత్రులు గడపలేక విసిగిపోయిన జనం, రాత్రి కాగానే తమ వెంట దిండ్లు, దుప్పట్లు, పరుపులు తీసుకుని గుంపులు గుంపులుగా బీచ్‌కి చేరుకుంటున్నారు. సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలపైనే పడుకుని రాత్రంతా హాయిగా నిద్రపోతున్నారు.
తిరిగి తెల్లవారుజామున ఎండ రాకముందే తమ దిండు, దుప్పట్లను సర్దుకుని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ప్రకృతి ప్రసాదించే చల్లటి గాలే దిక్కుగా మారుతున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం చర్చనీయాంశంగా మారాయి. Team India Record : టీమిండియా అన్వాంటెడ్ రికార్డ్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Rahul Gandhi: నీట్ పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం Supreme Court: సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులతో
పోల్చిన సుప్రీంకోర్టు
Nishant Tomar: ఢిల్లీలో పోలీస్ జాబ్ వదిలి..ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్
Operation Kagar: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..మహిళా నేత శకుంతల సరెండర్
Sadhu Dulal Giri Ji Maharaj : భగవంతుని సాక్షాత్కారం కోసం 12 ఏళ్లుగా నిలబడే దీక్ష !!
Elon Musk : ‘కాక్రోచ్’ల అపర సృష్టి మస్క్ దేనా?