
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు తప్పవు.
అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన యోగం ఉంది, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.
విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు.
నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
పరుస్తాయి.
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన యోగం ఉంది.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుంచి ఇబ్బందులు తప్పవు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహ