
Rahul Gandhi: రాబోయే నీట్-యూజీ (NEET-UG 2026) పునఃపరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. పరీక్షల్లో చీటింగ్ ముఠాల నెట్‌వర్క్‌లను ఛేదించే వ్యూహంలో భాగంగా, ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ‘టెలిగ్రామ్’ పై దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆంక్షలు విధించింది.
జూన్ 21న పరీక్ష జరగనున్న నేపథ్యంలో, జూన్ 22 వరకు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుండి తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. Read also: Supreme Court: సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పేపర్ లీకేజీలను అరికట్టడంలో విఫలమైన మోదీ సర్కార్, ఇలాంటి విచిత్రమైన ఉపాయాలతో విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెడుతోందని ఎద్దేవా చేశారు. “ఇది దొంగను పట్టుకోవడం చేతకాక, బాధితుడి ఇంటికి తాళం వేసినట్లుంది” అని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు తమ విద్యాసంబంధిత నోట్స్, టెస్ట్ సిరీస్‌ల కోసం టెలిగ్రామ్‌ను వాడుకుంటారని, అసలైన లీకేజ్ మాఫియాను వదిలేసి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.
దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనల్ Testing Agency (NTA) సమర్థించింది. వ్యవస్థీకృత నేరగాళ్లు, లీకేజీ ముఠాలు రీ-టెస్ట్ సమయంలో సమాచారాన్ని చేరవేయకుండా నిరోధించేందుకు ఈ తాత్కాలిక నిషేధం అవసరమని పేర్కొంది.
ఈసారి పరీక్ష పత్రాల రక్షణ మరియు పంపిణీ బాధ్యతల్లో భారత వైమానిక దళం (IAF) సేవలను కూడా ప్రభుత్వం వినియోగించుకుంటుండటం విశేషం. భారత ప్రభుత్వ నిర్ణయంపై టెలిగ్రామ్ అధినేత పావెల్ డ్యూరోవ్ అసహనం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు చేసే అక్రమాలకు దేశంలోని 15 కోట్ల మంది సాధారణ వినియోగదారులను దూరం చేయడం ఎంతవరకు న్యాయమని
ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కొత్తగా డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ అందుబాటులో లేనప్పటికీ, ఇప్పటికే మొబైల్స్‌లో ఇన్స్టాల్ చేసుకున్న వినియోగదారులు కొందరు వీపీఎన్ (VPN) ల ద్వారా దీనిని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
గత మే నెలలో జరిగిన నీట్-యూజీ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే, మరోసారి ఎలాంటి తప్పులు దొర్లకుండా రీ-ఎగ్జామ్‌ను పకడ్బందీగా పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ అసాధారణ నిర్ణయాలు తీసుకుంది.
Supreme Court: సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nishant Tomar: ఢిల్లీలో పోలీస్ జాబ్ వదిలి..ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్
Operation Kagar: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..మహిళా నేత శకుంతల సరెండర్
Sadhu Dulal Giri Ji Maharaj : భగవంతుని సాక్షాత్కారం కోసం 12 ఏళ్లుగా నిలబడే దీక్ష !!
Elon Musk : ‘కాక్రోచ్’ల అపర సృష్టి మస్క్ దేనా?
Congress On Amit Shah : ‘ఆపరేషన్ ఆకర్ష్’పై అమిత్ షాపై కాంగ్రెస్ నిప్పులు