
CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనత వల్లే పక్క రాష్ట్ర నాయకులు ఇక్కడ రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామగుండంలో జరిగిన ‘బాయిబాట’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారానికి మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటూ రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు.
తాము వారిని రానివ్వడం లేదంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే వారు ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఎందరో అమరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనమే ఏలుకోవాలని, పరాయి పాలకుల చేతుల్లో పెట్టొద్దని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also : భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని కవిత తన కథనంలో విశ్లేషించారు. రాష్ట్ర నాయకత్వం బలంగా లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాల నేతలు ఇక్కడ పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా ఇతర పార్టీల జోక్యాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గట్టిగా నిలబడ్డారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత పాలనలో ఆ దృఢత్వం లోపించిందని దుయ్యబట్టారు.
స్వరాష్ట్రంలో మన నిర్ణయాలు మనమే తీసుకోవాలనే కాంక్షతో ఏర్పడిన తెలంగాణలో, మళ్లీ ఇతర ప్రాంతాల నేతల నీడ పడటం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని కవిత స్పష్టం చేశారు. Donald Trump: ఆ ఒప్పందం నచ్చకపోతే ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తాం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Jowar Purchase Center Medak: జొన్నల
కొనుగోలు కేంద్రంలో లారీల కొరత.. రైతుల రాస్తారోకో
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?
Telangana Clean Energy Summit 2026: రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్
Medak District Land Survey: భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
ACB Raids : తెలంగాణలో ఏసీబీ దాడులు – అవినీతి అధికారిపై కేసు నమోదు, ఆస్తుల విలువ రూ. 100 కోట్లు!
Jukkal Indiramma Houses: పేదల సొంతింటి కల నిజమైంది