
వన్‌ప్లస్ N6 ఫోన్ 8,000mAh బ్యాటరీతో వస్తోంది ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20వేల కన్నా తక్కువ ఉండొచ్చు వన్‌ప్లస్ N6 ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆఫ్షన్లలో లభ్యం OnePlus N6 : వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వన్‌ప్లస్ నుంచి అతి త్వరలో భారత మార్కెట్లోకి సరసమైన ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ కన్నా వన్‌ప్లస్ ఎన్ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధర తక్కువగా ఉంటుంది. ఈ రాబోయే సిరీస్ కూడా ఈ నెలలో దేశ మార్కెట్లో లాంచ్ కానున్న వన్‌ప్లస్ N6తో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ N6 ఫోన్ 8,000mAh బ్యాటరీతో వస్తుందని వన్‌ప్లస్ వెల్లడించింది.
రూ. 25వేల లోపు స్మార్ట్ఫోన్ల కేటగిరీలో ఇదే అతిపెద్ద బ్యాటరీ (OnePlus N6) అని చెప్పొచ్చు. ఇటీవల దేశ మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6లో కూడా ఇదే కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది.
భారత మార్కెట్లో జూన్ 30న వన్‌ప్లస్ N6 లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20వేల లోపు ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ N6 ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాట్ ఫ్రేమ్, ఫ్లాట్ రియర్ ప్యానెల్ ఉన్నాయి.
రియర్ ప్యానెల్ పైభాగం నుంచి కెమెరా మాడ్యూల్ బయటకు వస్తుంది. పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ స్మార్ట్‌ఫోన్ రైట్ సైడ్ ఉన్నాయి. Read Also : Airtel vs Jio : జియో, ఎయిర్టెల్ ఏది బెటర్? ప్లాన్ మాత్రం ఒక్కటే.. డేటా బెనిఫిట్స్ వేరు..
ఛాయిస్ మీదే! ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) : వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ ఇటీవల లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999 ఉంటుంది. 8GB + 128GB వేరియంట్ ధర
రూ. 22,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 25,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్ప్లే (2,400x1,080 పిక్సెల్స్) అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి-G615 జీపీయూతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ఓమ్నివిజన్ OV50D40 ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో చైనాలో వన్‌ప్లస్ టర్బో 6X సిరీస్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో బేస్ మోడల్‌తో పాటు వన్‌ప్లస్ టర్బో 6X ప్రో కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ టర్బో 6X 7000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.