
iPhone 17 Pro Price : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఫ్లాగ్షిప్ మోడల్ ఐఫోన్ 17 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సరికొత్త ప్రో మోడల్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరాతో బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.
ఐఫోన్ 17 ప్రో ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఐఫోన్ 17 ప్రో ఆఫర్లు, ధర ఎంతంటే? : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,22,900 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ (iPhone 17 Pro Price) క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై ఫ్లాట్ రూ.
9వేలు తగ్గింపు అందిస్తుంది. దాంతో అసలు ధర రూ. 1,13,900 అవుతుంది. ఈ ఐఫోన్ గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 1,34,900 ధరకు లాంచ్ అయింది. తద్వారా ఐఫోన్ 17 మోడల్ రూ. 21వేలకు చౌకగా లభిస్తోంది. అంతేకాదు.. మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తే ధర రూ.
60,300 వరకు తగ్గించుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఉంటుంది. Read Also : itel A100 Pro Variant : వావ్.. ఆఫర్ అదిరింది బ్రో.. కొత్త ఐటెల్ A100 ప్రో కొంటే ఫ్రీగా నెక్ బ్యాండ్.. ఈ డీల్ మిస్ కావొద్దు!
ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 17 ప్రోలో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2622×1206 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz టాప్ బ్రైట్ నెస్, 3,000 నిట్స్ వరకు ఉంటుంది.
ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో USB 3.0 టైప్-సి పోర్ట్, 5G
, Wi-Fi 7, eSIM సపోర్ట్ బ్లూటూత్ 6 ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఐఫోన్ డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. 30 నిమిషాల వరకు 6 మీటర్ల లోతు నీటిలో ముంచినా ఫోన్ పాడవ్వదు.