
కొందరికి పచ్చిగా కూరగాయలు, ఆకు కూరలతో కలిపి సలాడ్స్ తింటూ ఉంటారు. అయితే మీకు ఈ అలవాటుంటే వానాకాలంలో దానికి దూరంగా ఉండండి. పచ్చి కూరగాయలపై బ్యాక్టీరియా, కలుషిత నీటి తాలూకు క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి రకరకాల వ్యాధులకు కారణమవుతాయి.
వీటిని తినడం వల్ల పొట్ట సమస్యలు రావొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సీఫుడ్ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే వానాకాలంలో చేపల వేట తక్కువగా ఉంటుంది. దీంతో నిల్వ చేసిన చేపలనే అమ్ముతుంటారు. అలాంటి సీఫుడ్ తింటే ఫుడ్ పాయిజనింగ్, పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
కాబట్టి చేపలను తినకపోవడమే మంచిది. వానాకాలంలో రోడ్డు పక్కన అమ్మే కట్ చేసిన పండ్లు, జ్యూస్లు తాగకూడదు. వీటిని తినడం, తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. వాటిపై బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా అధికంగానే ఉంటుంది.
వీటి వల్ల పొట్ట ఇన్ఫెక్షన్, వాంతులు, విరేచనాలు, నీరసం వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో చాలామంది స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ అది ఏమాత్రం మంచిది కాదు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. బయట బండ్ల మీద అమ్మే ఫుడ్, మూతపెట్టని ఆహార పదార్థాలు తింటే వ్యాధులు రావచ్చు.
చాట్, పానీపూరి, సమోసాలు, పకోడీలు లాంటివి వానాకాలంలో తగ్గించడం మంచిది
.