జియో మోటివ్ అనేది 4G eSIM ఆధారిత GPS ట్రాకర్. దీన్ని కారు OBD పోర్ట్‌లో నేరుగా అమర్చవచ్చు. ప్రత్యేకంగా వైర్లు లేదా టెక్నీషియన్ అవసరం లేకుండా ప్లగ్ అండ్ ప్లే విధానంలో పనిచేస్తుంది. ఈ పరికరం ద్వారా మీ కారు ఎక్కడ ఉందో 24 గంటల పాటు రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు.
జియోథింగ్స్ (JioThings) యాప్ ద్వారా అన్ని వివరాలు మొబైల్లో కనిపిస్తాయి. జియోమోటివ్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ కారులో వైఫై హాట్‌స్పాట్ సదుపాయం. మీ జియో మొబైల్ నంబర్లో ఉన్న డేటా ప్లాన్‌ను ఇదే డివైస్ ఉపయోగిస్తుంది. దీంతో ప్రయాణ సమయంలో కారులోనే హైస్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు.
ఒకేసారి గరిష్ఠంగా 8 డివైస్‌లను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, పిల్లలు ప్రయాణ సమయంలో సులభంగా ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు. జియో మోటివ్లో జియో ఫెన్సింగ్ (Geo Fencing), టైమ్ ఫెన్సింగ్ (Time Fencing) వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఈ డివైజ్‌తో కారు ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి ప్రవేశించినా లేదా బయటకు వెళ్లినా వెంటనే అలర్ట్ వస్తుంది. మీరు నిర్ణయించిన సమయాల్లో కారు కదిలితే నోటిఫికేషన్ అందుతుంది. టోయింగ్ (Tow) చేసినా లేదా పరికరాన్ని తొలగించడానికి ప్రయత్నించినా వెంటనే హెచ్చరిక వస్తుంది.
3D జైరోస్కోప్, యాక్సిలరోమీటర్ సెన్సర్లతో భద్రతను మరింత పెంచారు. ఈ పరికరం కేవలం ట్రాకింగ్‌కే పరిమితం కాదు. కారు ఆరోగ్యంపై కూడా సమాచారం అందిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్, ఇంజిన్ లోడ్, కూలెంట్ ఉష్ణోగ్రత, ఎయిర్ ఇన్‌టేక్ టెంపరేచర్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా వాహనంలో ఏర్పడే వివిధ సాంకేతిక లోపాలపై కూడా హెచ్చరికలు అందుతాయి. దీంతో ముందుగానే సమస్యలను గుర్తించి రిపేర్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. JioMotive డ్రైవింగ్ పద్ధతిని కూడా విశ్లేషిస్తుంది. అధిక వేగం, సడన్ బ్రేకింగ్, వేగంగా యాక్సిలరేషన్, హఠాత్తుగా మలుపులు తిప్పడం వంటి అంశాలపై అలర్ట్‌లు పంపుతుంది.
అలవర్చుకోవచ్చు. గత ప్రయాణాల వివరాలను కూడా పరిశీలించవచ్చు.
ఈ పరికరం జియో SIMతో మాత్రమే పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, భారీ వాణిజ్య వాహనాలు, కొన్ని ప్రత్యేక కార్ మోడళ్లకు సపోర్ట్ ఉండదు. ఒకసారి జియో నంబర్‌తో యాక్టివేట్ చేసిన తర్వాత ఆ నంబర్‌ను మార్చడం సాధ్యం కాదు. కొనుగోలు చేసిన తర్వాత ఇది సాధారణంగా నాన్-రిటర్నబుల్ ఉత్పత్తిగా ఉంటుంది. కారు భద్రత, ట్రాకింగ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఒకే పరికరంలో కావాలనుకునే వారికి JioMotive మంచి ఎంపికగా చెప్పవచ్చు.
దీంతో సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లు