
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించిన అనేక తప్పుడు సందేశాలు టెలిగ్రామ్‌లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.
“PAPER LEAKED NEET”, “Re-NEET 2026”, “Private Mafia” వంటి పేర్లతో కొన్ని ఛానళ్లు విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. పరీక్ష పేపర్ తమ వద్ద ఉందని చెబుతూ వేల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే వాస్తవానికి ఎలాంటి పేపర్ లీక్ జరగలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష పత్రాలు అత్యంత భద్రతా వ్యవస్థలో ఉంటాయని, బయటకు వచ్చే అవకాశం లేదని పేర్కొంది. విద్యార్థుల్లో భయం, గందరగోళం సృష్టిస్తున్న మోసపూరిత ప్రచారాన్ని అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
కేవలం టెలిగ్రామ్ సేవలనే కాకుండా, ఇప్పటికే పంపిన సందేశాలను తర్వాత సవరించే (Edit Message) ఫీచర్‌పై కూడా పరిమితులు విధించారు. జూన్ 30 వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో నిలిపివేయాలని ఆదేశించారు. పరీక్ష పూర్తైన తర్వాత అసలు ప్రశ్నాపత్రాన్ని పాత పోస్టులో చేర్చి, ముందే లీక్ అయినట్లు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఏ పేర్కొంది.
మరోవైపు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డ్యూరోవ్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కొందరు వ్యక్తుల తప్పిదాల కారణంగా కోట్లాది సాధారణ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వందల సంఖ్యలో అనుమానాస్పద ఛానళ్లను తొలగించామని వెల్లడించారు.
బ్లాక్ చేయడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. జూన్ 21న నీట్ రీ-టెస్ట్ యథావిధిగా జరుగుతుందని, విద్యార్థులు అధికారిక ఎన్టీఏ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఇక ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ కూడా ఈ నిషేధాన్ని వ్యతిరేకించింది. మొత్తం ప్లాట్‌ఫారమ్‌ను