.webp&w=3840&q=75)
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా, ఆర్థిక మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సంబంధించిన కమిషన్ వ్యవహారాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని విమర్శించారు.
పొంగులేటి ఎంతగా సంపాదించారంటే, నోట్లను లెక్కించే యంత్రాలు కూడా అలసిపోయే స్థాయిలో అక్రమ సంపాదన చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం ఈడీ దాడులు జరిగినప్పటికీ, అప్పట్లో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన వందల కోట్ల రూపాయల అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదన్నారు.
ఆ దాడులపై బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీతో పొంగులేటికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఈడీ ఆయనపై తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణలో కోటి ఎకరాల భూములను వివాదాస్పద జాబితాలో చేర్చి, వాటి పేరుతో భూదందాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
భూములపై ఆంక్షలు విధించి, బాధితులను బెదిరించి సెటిల్మెంట్లు చేయిస్తున్నారని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి దొంగ అయితే, పొంగులేటి గజదొంగ” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి అహంకారపూరిత వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడం, మరో మంత్రి వాకిటి శ్రీహరిపై కాగితాలు విసరడం వంటి ఘటనలు ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. బీసీ మంత్రులు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులేనని, వారిపట్ల గౌరవం చూపాలని సూచించారు.
అధికారులతో సైతం “సెన్స్ ఉందా?” అంటూ మాట్లాడుతున్న పొంగులేటి వైఖరిని తప్పుబట్టిన కేటీఆర్, “ఈ రోజు నేను అడుగుతున్నాను... నీకు సెన్స్ ఉందా పొంగులేటి?” అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్, భూదందాలు, వివాదాస్పద భూముల వ్యవహారాల్లో తన కుమారుడిని అడ్డుపెట్టుకొని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఆరోపణలను ప్రస్తావించారు.
తన కుమారుడిపై నమోదైన పోలీసు కేసును ప్రభావితం చేసి సంబంధిత అధికారులను బదిలీ చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అన్యాయాలు, అక్రమాలు, అహంకారాన్ని గమనిస్తున్నారని, అందుకే పాలేరులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. హౌసింగ్ మంత్రిగా 20 లక్షల ఇళ్లు నిర్మించిన తర్వాతే ఓట్లు అడుగుతానని గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ, ఆ మాటపై నిలబడే సత్తా ఉందా అని పొంగులేటిని కేటీఆర్ ప్రశ్నించారు.
దేశంలో 40 శాతం లోటు.. లడక్ లో మాత్రం 96శాతం అధిక వర్ష పాతం!
.
వట్టి నాగులపల్లిలో భూముల వివాదాల సందర్భంగా తన అనుచరులను పంపించి దాడులకు పాల్పడ్డారనే