
అమరావతి: రాష్ట్ర హోంమంత్రి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి డీఎస్‌బీవీ స్వామి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని మందలించాల్సింది పోయి సమర్థించడం జగన్‌కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఎస్సీలంటే జగన్‌కు మొదటి నుంచీ చులకన భావమే. ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన పెత్తందారీ పోకడలు మారలేదు. వైకాపా నేతలు సంస్కారహీనంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు’’ అని డీఎస్‌బీవీ స్వామి అన్నారు. మంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
ఆ వ్యాఖ్యలను అమర్నాథ్ సమర్థించుకోవడం వైకాపా విష సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. దళితులను అవమానించే వక్రబుద్ధిని ఆ పార్టీ నేతలు మానుకోవాలన్నారు. అనితకు అమర్నాథ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.