ఉదయం లేవగానే పాదాల నొప్పి ఎక్కువగా ఉందా? ముఖ్యంగా మడమ నేలకు అనిస్తే తీవ్ర నొప్పితో బాధపడుతున్నారా? ఎక్కువ సేపు కూర్చొని లేవగానే మడమ నొప్పితో ఇబ్బందికి గురువుతున్నారా? అయితే, మీరు మడమ శూల నొప్పితో బాధపడుతున్నారని అర్థం. దీనిని ప్లాంటార్ ఫాసిటిస్ (Plantar Fasciitis) అని కూడా పిలుస్తారు.
ఈ పరిస్థితి తీవ్రమైన మడమ నొప్పికి, నడవడంలో ఇబ్బందికి కారణమవుతుంది. పాదం యొక్క అరిభాగంలో (ప్లాంటార్ సైడ్) మడమ ఎముకను కాలివేళ్లకు కలిపే కండర పట్టీ వాపుకు గురవుతుంది. నడిచేటప్పుడు ఈ పట్టీ ఒక కుషన్ లాగా, షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది.
చాలా మంది ఉదయం నిద్రలేవగానే ప్లాంటార్ ఫాసైటిస్ నొప్పిని అనుభవిస్తారు. ఈ నొప్పి మడమ, అరికాళ్ళు రెండింటిలోనూ రావచ్చు. దీనికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ రవికుమార్ ముకార్తిహాల్ (కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పర్ష్ హాస్పిటల్, ఇన్ఫాంట్రీ రోడ్, బెంగళూరు) పూర్తి వివరాలు అందించారు.మడమ శూల నొప్పికి కారణాలు కాళ్లపై అధిక ఒత్తిడి వాపు, నొప్పికి కారణమవుతుంది.
అధిక ఒత్తిడి అనేది బరువు పెరగడానికి ఒక లక్షణం. సాధారణం కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్న వ్యక్తులు ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. BMI 22.1కి మించకూడదు. మీరు చాలా అలసిపోయి ఉంటే, మడమలో తీవ్రమైన నొప్పి కలగవచ్చు. నిరంతరం నిలబడటం లేదా కూర్చోవడం వల్ల మడమ నొప్పి రావచ్చు.
వయసు పెరిగే కొద్దీ కాళ్ళ కండరాలు బలహీనపడటం సమస్యలకు కారణం కావచ్చు. కాళ్లకు చెప్పులు లేకుండా నడిచే అలవాటు వల్ల కూడా మడమ నొప్పి రావచ్చు. గట్టి నేలపై నడవడం వల్ల పాదాల అరికాళ్ళలో నొప్పి కలగవచ్చు. చాలా బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల పాదాల్లోని కండరాలపై ఒత్తిడి పడి, ప్లాంటార్ ఫాసైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది?
. అకస్మాత్తుగా నడక లేదా వ్యాయామ సమయాన్ని పెంచినవారు. సరైన సపోర్ట్ లేని (గట్టి లేదా పల్చటి) పాదరక్షలు ధరించేవారు. ఫ్లాట్ ఫీట్ (పాదాలు చదునుగా ఉండటం) ఉన్నవారు. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు.ప్రధాన లక్షణం ఉదయం నిద్ర లేవగానే వేసే మొదటి కొన్ని అడుగులలో లేదా ఎక్కువ సేపు కూర్చుని లేచినప్పుడు మడమలో తీవ్రమైన, పదునైన నొప్పి రావడం దీని ముఖ్య లక్షణం.నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టంచాలా మంది దీనిని సాధారణ పాదాల నొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే నడవడం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా, నొప్పి వల్ల నడిచే పద్ధతి (Posture) మారిపోయి... అది కాస్తా మోకాలు, నడుము, వెన్ను నొప్పులకు దారితీస్తుంది.పాటించాల్సిన చిట్కాలు పాదాలకు మంచి సపోర్ట్ ఇచ్చే సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించాలి. శారీరక శ్రమను లేదా వ్యాయామాల్ని అకస్మాత్తుగా కాకుండా క్రమంగా పెంచాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించాలి. క్రమం తప్పకుండా పిక్కలు, పాదాల కండరాల్ని స్ట్రెచింగ్ (సాధన) చేయాలి. మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.సకాలంలో వైద్యులను సంప్రదించి, సరైన రోగనిర్ధారణ చేసుకుంటే.. విశ్రాంతి, ఐస్ ప్యాక్ పెట్టడం, స్ట్రెచింగ్ వ్యాయామాలు వంటి చిన్న చిన్న చిట్కాలతో ఎటువంటి పెద్ద సర్జరీలు లేదా చికిత్సలు లేకుండానే దీని నుంచి పూర్తిగా కోలుకోవచ్చు.ముఖ్యమైన విషయాలు ఐస్ రోలింగ్: ఒక చిన్న వాటర్ బాటిల్లో నీళ్లు పోసి ఫ్రిజర్‌లో పెట్టి ఐస్ చేయండి. ఆ బాటిల్‌ను నేలపై ఉంచి, మీ పాదాల కింద వేసి వెనక్కి, ముందుకు 10-15 నిమిషాల పాటు దొర్లించండి (రోల్ చేయండి). ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది. టవల్ స్ట్రెచ్: ఉదయం మంచం దిగడానికి ముందే, ఒక టవల్‌ను మీ పాదం ముందుభాగానికి తగిలించి, మీ వైపుకు లాగండి. ఇలా 15-30 సెకన్ల పాటు ఉంచి వదిలేయండి. ఇది ఉదయాన్నే వచ్చే తీవ్రమైన నొప్పిని తగ్గిస్తుంది. సరైన చెప్పుల ఎంపిక: ఇంట్లో కూడా ఒట్టి కాళ్లతో నడవకుండా, మెత్తటి కుషన్ ఉన్న చెప్పులు (MCR/Soft chappels) ధరించడం మంచిది. ముఖ్యంగా గట్టి నేలపై నడవడం తగ్గించాలి.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ రవికుమార్ ముకార్తిహాల్ కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, (స్పర్ష్ హాస్పిటల్, ఇన్ఫాంట్రీ రోడ్, బెంగళూరు)
ఎక్కువ సమయం నిలబడి పనిచేసేవారు