
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద మొత్తం 529 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామకాల్లో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ (NPHCE) – 86 పోస్టులు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం (General Nursing & Midwifery) పూర్తి చేసి ఉండాలి.
అదనంగా చెల్లుబాటు అయ్యే APNMC రిజిస్ట్రేషన్ తప్పనిసరి. డీ.ఫార్మసీ, బీ.ఫార్మసీ లేదా ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ సంబంధిత కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో నమోదు ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ – నెలకు రూ.23,494 ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులు, మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఎంపిక చేపడతారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు – రూ.900 ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 30, 2026 అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, అవసరమైన
పత్రాలను సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత