
నాగ్ అశ్విన్ ప్రమేయంతో.. సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కాకుండా సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా.. ఆమధ్య మరో చిత్రం పేరు కూడా వినిపించింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) దర్శకత్వంలో వచ్చిన ‘సింగ్ గీతం’ (Sing Geetham) బాక్సాఫీస్ వద్ద మంచి స్పందననే రాబట్టుకుంటోంది.
94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించి.. మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందడం అంటే మాములు విషయం కాదు. అది ఆయన చేసి చూపించారు. దీని వెనుక దర్శకుడు నాగ్ అశ్విన్ కృషిని కూడా మెచ్చుకోవాలి. సింగీతంపై ఉన్న ప్రేమతో ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో..
నాగ్ అశ్విన్ (Nag Ashwin)కు కూడా సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. వాస్తవానికి ‘సింగ్ గీతం’ కథని సింగీతం ఎప్పుడో రాసుకున్నారు. ఆ విషయం కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఓ స్టేజ్‌పై చెప్పారు. నాగ్ అశ్విన్ ప్రమేయంతో.. సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా కాకుండా సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా.. ఆమధ్య మరో చిత్రం పేరు కూడా వినిపించింది. ఆ వివరాల్లోకి వెళితే.. అప్పట్లో ఓ బయోపిక్‌ని సింగీతం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. భోగినిగా లైఫ్‌ని మొదలెట్టి.. ఆ తర్వాత సంగీత సాహిత్యాలకు ఎంతో సేవ చేసి వీర వనితగా పేరు పొందిన ‘బెంగళూరు నాగరత్తమ్మ’ (Bangalore Nagarathnamma) కథని తెరపైకి తీసుకురావాలని సింగీతం ఎంతో తపించారు.
కథ కూడా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో స్వీటీ అనుష్క పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత సమంతతో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అవేవీ నిజం కాలేదు. కర్ణాటక సంగీతానికి ‘బెంగళూరు నాగరత్తమ్మ’ చేసిన సేవ వెలకట్టలేనిది.
ప్రయత్నించారు.
చాలా రోజులు ఈ కథని పట్టుకుని ఆయన హీరోయిన్ల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో అనుష్క దాదాపు కన్ఫర్మ్ అనేలా కూడా వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ, ప్రయత్నాలతోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు తన వయసును కూడా లెక్క చేయకుండా సింగీతం మెగా ఫోన్ పట్టడంతో.. మరోసారి ‘బెంగళూరు నాగరత్తమ్మ’ ప్రాజెక్ట్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. కాకపోతే.. ‘సింగ్ గీతం’ బాధ్యతలను తీసుకున్న నాగ్ అశ్విన్‌లా.. ‘బెంగళూరు నాగరత్తమ్మ’ బాధ్యతలు తీసుకోవడానికి.. ఆయన ప్రియ శిష్యులు ఎవరో ఒకరు ముందుకు రావాల్సి ఉంది. ఈ లెజెండరీ డైరెక్టర్ కలల ప్రాజెక్ట్ బాధ్యతని భుజానికెత్తుకునే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.
ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్
ఆమె కథని అందరికీ తెలియచేయాలని సింగీతం ఎంతగానో