
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వరంగల్ వచ్చి, అభిమానిని కలవడం పట్ల బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం చేశారు. కొందరికి తమ అభిమానాన్ని చాటుకోవడానికి మాటలు రావు, వారు దానిని చేతల్లోనే చూపిస్తారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) కూడా మాటల మనిషిగా కాకుండా చేతల మనిషిగా మారారు. తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నిరంజన్ (Niranjan) అనే తన అభిమానిని కలవడానికి ఆంధ్రప్రదేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ వెళ్ళారు.
అక్కడ నిరంజన్ను, అతని కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు భక్తుడినని చెప్పుకునే బండ్ల గణేశ్ తన వంతుగా నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. పొనుగోటి నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడటం తనను కలచి వేసిందని బండ్ల గణేశ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఆ అభిమానిని కలవడానికి రావడం తన హృదయాన్ని కదలించిందని చెప్పారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ భక్తుడిగా, ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కు, అతని కుటుంబానికి అండగా నిలుస్తూ రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు బండ్ల గణేశ్.
డిప్యూటీ సీఎం రాకతో వరంగల్ లోని జన సైనికులు సైతం నిరంజన్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండటానికి ముందుకొచ్చారు. అలానే బండ్ల గణేశ్ తీసుకున్న చొరవతో మరింతమంది ఆ కుటుంబానికి ధనరూపంలో విరాళాలు ఇచ్చే ఆస్కారమూ ఉంది. ప్రధాని మోదీ వీడియోలో..
అల్లు అర్జున్ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్ ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్