
వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు ₹349కే 5G ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజూ 1.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 SMSలు వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
విఐ కంపెనీ ఈ ప్లాన్‌తో అన్లిమిటెడ్ 5G డేటా ఇస్తున్నప్పటికీ, దీనికి 300GB ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) పరిమితి వర్తిస్తుంది. అదనంగా కస్టమర్లకు బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, డేటా డిలైట్, Vi మూవీస్ & టీవీ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ధర పరంగా చూస్తే రిలయన్స్ జియో అందిస్తున్న ₹198 ప్లాన్ దేశంలోనే అత్యంత చౌకైన 5G ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజూ 2GB డేటాను అందిస్తుంది. దీనితో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో 'ట్రూలీ అన్లిమిటెడ్ 5G డేటా' లభిస్తుంది. అంటే అర్హత ఉన్న 5G యూజర్లు ఎలాంటి డేటా పరిమితి లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. JioTV, Jio AI క్లౌడ్ వంటి సేవలకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
మూడు కంపెనీల ప్లాన్లను పోల్చి చూస్తే ధర విషయంలో జియో అందరికంటే ముందుంది. వొడాఫోన్ ఐడియా ప్రారంభ 5G ప్లాన్ ₹349, ఎయిర్టెల్ ప్లాన్ ₹379 ఉండగా, జియో కేవలం ₹198కే 5G అనుభవాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది. ధర విషయంలో జియో చౌకగా ఉన్నప్పటికీ, వ్యాలిడిటీ, డేటా అవసరం, అదనపు ఓటీటీ లేదా క్లౌడ్ సౌకర్యాల ఆధారంగా మీ ఎంపిక మారవచ్చు.
తక్కువ రోజుల వ్యాలిడిటీ అయినా పర్వాలేదు, చాలా తక్కువ ధరలో 5G ఇంటర్నెట్ వాడాలి అనుకునేవారికి ప్రస్తుతం జియో ₹198 ప్లాన్ ఉత్తమమైన ఎంపిక
.