
నీతిశాస్త్ర కోవిదుడు చాణక్యుడు అందరికీ పరిచయమే. ఆయన సూక్తులను ఇప్పటికీ అనుసరించేవారు ఉన్నారు. చాణక్య నీతి ని ఫాలో అయితే.. జీవితంలో విజయం, సంపద, వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. చాణక్యుడి ప్రకారం.. ఒక స్త్రీ.. పురుషుల్లో ఏం చూస్తుంది..?
ఏ లక్షణాలు చూసి ఇష్టపడుతుంది? కేవలం అందం, డబ్బు ఉంటే సరిపోతాయా..? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అమ్మాయిలు అబ్బాయిల్లో అందం కన్నా సహనం ఎక్కువ చూస్తారు. ముఖ్యంగా తాము చెప్పింది వింటున్నారా లేదా అనే విషయంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.
తాము చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని అనుకుంటారు. తమ మాటలను వినకుండా నిర్లక్ష్యం చేసే అబ్బాయిలు మహిళలకు అస్సలు నచ్చరు. ప్రతి అబ్బాయిలో అమ్మాయిలు ముందుగా చూసేది నిజాయితీ. మరీ ముఖ్యంగా మా జీవితంలోకి వచ్చే అబ్బాయి చాలా నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటారు.
నిజాయితీగా ఉండే వారు తమను ఎప్పటికీ మోసం చేయరని.. తమను జీవితాంతం సంతోషంగా చూసుకుంటారని నమ్ముతారు. అలాంటి వ్యక్తినే కోరుకుంటారు. అంతేకాదు.. తమతో చాలా మర్యాదగా ఉండాలని.. నలుగురు ముందు అవమానించకూడదని కోరుకుంటారు. అబ్బాయిల్లో ఉండే కామెడీ సెన్స్ ని అమ్మాయిలు చాలా ఎక్కువగా ఇష్టపడతారు.
ఎప్పుడూ నవ్వుతూ.. చుట్టూ ఉన్నవారందరినీ నవ్విస్తూ ఉండేవారి పట్ల అమ్మాయిలు చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు. సెన్సాఫ్ హ్యూమర్ ఉండే అబ్బాయిలతో ఉంటే.. జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటామని నమ్ముతారు
.