
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ సందేశం చేరేలా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. Read also: Vijayawada Rainbow Hospital: విజయవాడ రెయిన్ బో హాస్పిటల్లో అగ్నిప్రమాదం..
అసలేం జరిగింది? ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు 45 రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఎంపీల నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అందరూ ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు, బుక్లెట్లు అందించాలని ఆయన తెలిపారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
‘తల్లికి వందనం’, ‘దీపం-2’ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ. 4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమం, ‘అన్నదాత సుఖీభవ’ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గతంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్ల నష్టం జరిగిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
ప్రత్యర్థుల ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా ప్రతి ఓటును సరిచూసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఆయన సూచించారు.
Vijayawada Rainbow Hospital: విజయవాడ రెయిన్ బో హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Weather update: వర్షాకాలం వచ్చినా వానలు లేవు.. ఆందోళనలో రైతులు!
Kakinada News: జ్ఞానేశ్వరి కేసులో సంచలన మలుపు.. బొమ్మలతో కొత్త ప్రయోగం
Nellore Dowry Harassment:అదనపు కట్నం వేధింపులు.. భార్యపై దాడి!
Kalyandurg News: అభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యం!
ఎమ్మెల్యేలు బీఎల్ఏలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, సమస్యలు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాలని