ఇందు, రాజు ఇద్దరూ ఒకరినొకరు నీది ఓవర్ యాక్షన్ అంటే నీది ఓవర్ యాక్షన్ అని తిట్టుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఐశ్వర్య చూస్తుంది. పైగా రాజు కింద పడుకుంటున్నాడేంటి? అని అనుమానిస్తుంది ఐశ్వర్య.
ఇదే విషయాన్ని రేఖకి చెప్పాలని ప్రయత్నిస్తుంది. రాజు, ఇందు మీద ఏదో అనుమానంగా ఉంది.. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది.. కొత్తగా పెళ్లైన వారి మధ్యన ఉండాల్సినవి కనిపించడం లేదు.. గిల్లి గిల్లి కజ్జాలు అవేవో కనిపించడం లేదు అని ఐశ్వర్య అంటుంది. అవి గిల్లి గిల్లి కజ్జాలు బెల్లంకజ్జికాయలు కాదు.. గిల్లికజ్జాలు అని రేఖ అంటుంది. ఆ.. అదేలే.. ఏదో ఒకటి.. అవేవీ కూడా కనిపించడం లేదు.. నాకు ఆ ఇద్దరి మీద తేడా కొడుతోంది.. పైగా రాజు గాడు కింద పడుకుంటున్నాడు అని ఐశ్వర్య అంటుంది. అంటే ఇందు చెప్పింది నిజమే అన్నమాట.. వాడ్ని దూరం పెడుతోంది.. మనకు కావాల్సింది కూడా అదే అని రేఖ లోలోపల అనుకుంటుంది. ఆ ఇద్దరూ నాటకం ఆడుతూ మనల్ని మోసం చేస్తున్నారేమో అని అనిపిస్తోందంటూ ఐశ్వర్య అంటుంది.షాక్‌లో ఐశ్వర్య.. రేఖను తీసుకువెళ్లి ఆ దృశ్యాల్ని చూపించాలని ఐశ్వర్య అనుకుంటుంది. కానీ డోర్ తీసే సరికి అక్కడ ఏమీ ఉండదు. దీంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఏం ఉంది.. ఏం లేదు.. కదా.. నువ్వు చెప్పిందే నిజం అయితే ఇక్కడ చాప ఉండాలి కదా? అని ఐషూని రేఖ తిడుతుంది. నిజం ఆంటీ.. ఇక్కడే ఉండాలి.. నేను చూశాను.. ఇప్పుడంతా ఇలా ఉంది.. నన్ను నమ్మండి అని రేఖతో ఐశ్వర్య అంటుంది. ఇంతలో గార్డెన్ నుంచి ఇందు, రాజు మాటలు వినిపిస్తుంటాయి. దీంతో అటు వైపుగా చూస్తుంది ఐశ్వర్య.రొమాంటిక్‌గా రాజు, ఇందు.. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటే.. అసలు విషయం తెలుస్తుంది.. ఇక్కడే కిటీకి వద్ద నుంచి చూద్దామని ఐశ్వర్య అంటుంది. ఇక గార్డెన్ ఏరియాలో రాజు, ఇందు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఇందు అలిగినట్టుగా, రాజు బతిమాలుడుతున్నట్టుగా నటిస్తారు. ఏంటి ఇద్దరూ క్లోజ్ అవుతున్నారా? అంటే ఇందు నాకు అబద్దం చెబుతోందా? వాడికి చెబుతోందా? నా దగ్గర అబద్దం చెప్పేంత ధైర్యం ఇందుకి లేదు లే అని రేఖ అంటుంది. ఇక రాజు, ఇందు ఓ సాంగ్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటారు. ఇదంతా మనం చూడాలా? అని చిరాగ్గా రేఖ అంటుంది.గమనించిన రేఖ, ఐశ్వర్య.. నీకు ఇష్టం లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకున్నా.. నువ్వంటే నాకు ఇష్టం.. నీ కోసం నేను ఏమైనా చేస్తా అని రాజు నటిస్తాడు. పైగా ఇందుని హగ్ చేసుకుంటాడు. ఇదంతా చూసి ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇంకోసారి ఇలాంటి విషయాలు నాకు చెప్పకు అని తిట్టేసి వెళ్లిపోతుంది రేఖ. ఈ ఇద్దరూ నటిస్తున్నారు.. నేను బయటపెట్టాల్సిందే అని ఐశ్వర్య అనుకుంటుంది. ఇక వాళ్లు వెళ్లిపోయారు.. నీ ఓవర్ యాక్షన్ ఆపితే బెటర్ అని హగ్ చేసుకుంది చాలు.. దూరం జరుగు అన్నట్టుగా రాజుతో ఇందు అంటుంది. అమ్మో ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలని రాజు, ఇందు అనుకుంటారు.లక్కీని నమ్మించిన ఐశ్వర్య.. లక్కీ గాడు అయితే అసలు విషయం చెబుతాడు అని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతుంది ఐశ్వర్య. చూడాలనిపిస్తోంది.. అని చెప్పి బయటకు తీసుకు వస్తుంది లక్కీ. అక్కడ కాస్త ప్రేమగా మాట్లాడి లక్కీని ట్రాప్ చేస్తుంది ఐశ్వర్య. అసలు రాజు, ఇందుల పెళ్లి ఎలా జరిగింది? అని మెల్లిగా అడుగుతుంది ఐశ్వర్య. నాక్కూడా చెప్పలేదు.. వేరే వాళ్లు చెబితేనే నాకు తెలిసిందని లక్కీ అంటాడు. అంటే వీడికి కూడా నిజం తెలీదన్న మాట.. డోస్ పెంచి.. కాస్త ప్రేమగా నటిద్దామని ఐశ్వర్య అనుకుంటుంది. అలా చేతులు వేసి మాట్లాడే సరికి లక్కీ మరింతగా కరిగిపోతాడు.హగ్ ఇచ్చి మరీ.. నా కోసం అసలు నిజం తెలుసుకో.. ఎంతైనా ఇందు నా చెల్లి కదా.. దాని బాగోగులు చూసుకోవాలి కదా అని లక్కీతో ఐశ్వర్య అంటుంది. దీంతో రాజుని సిట్టింగ్‌కు పిలుస్తాడు లక్కీ. రాజు కూడా ఈ విషయాలేవీ తెలియక వస్తానని అంటాడు. దీంతో లక్కీకి మరింత డోస్ పెంచాలని హగ్ ఇస్తుంది ఐశ్వర్య. ఇలా మన పని మనం చేస్తే.. వీడు కూడా మనకు కావాల్సింది చేస్తాడు అని ఐశ్వర్య లోలోపల అనుకుంటుంది. ఇక సిట్టింగ్‌లో రాజు అన్ని విషయాలు చెప్పేస్తాడు అని ఐశ్వర్య సంబర పడుతూ ఉంటుంది.వెంకీ కాలికి గాయం.. మరో వైపు వెంకీ రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు. సాఫ్ట్ వేర్ జాబ్‌కి వెళ్లాడని చలపతి సంబరపడతాడు. లక్ష్మీ ఏమో వెంకీ కాలికి ఉన్న గాయాల్ని చూసి కంగారు పడుతుంది. అసలు నువ్వు చేసేది సాఫ్ట్ వేర్ జాబేనా? మరి ఇలా రోడ్ల మీద తిరిగే వాడిలా కాళ్లు అలా అయ్యాయ్ ఏంటి? అని చలపతి అడుగుతాడు. కొత్త షూస్ కదా అందుకే ఇలా అయిందని వెంకీ అబద్దం చెబుతాడు. దీంతో లక్ష్మీ బాధపడుతుంది. వెంకీ కాళ్లకి వెన్న తీసుకు వచ్చి రాస్తుంది. వెంకీ తన పరిస్థితిని తల్చుకుని బాధపడతాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: పీక్స్‌కి వెళ్లిన ప్రభావతిలోని శాడిజం..అత్తకి సేవలు చేస్తూనే వీడియో కాల్లో కథను నడిపిన మీనా