
Read also: Reebok : రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం జూన్ 21న నిర్వహించనున్న NEET-UG 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద టెలిగ్రామ్ సేవలను జూన్ 22 వరకు తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇటీవలి కాలంలో లీక్ మెటీరియల్స్, మోసపూరిత కంటెంట్‌ను పంచుతున్న అనేక ఛానెళ్లపై టెలిగ్రామ్ చర్యలు తీసుకుందని దురోవ్ తెలిపారు. అనుమానాస్పద గ్రూపులు, ఛానెళ్లను తొలగించడం ద్వారా సమస్య పరిష్కారానికి సహకరించామని ఆయన పేర్కొన్నారు.
అసలు సమస్యకు కారణమైన వ్యక్తులను గుర్తించకుండా మొత్తం ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేయడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. టెలిగ్రామ్ సేవలపై ఆంక్షలతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది.
పరీక్షల అనంతరం పాత సందేశాలను మార్చి తప్పుడు ఆధారాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని NTA ఆందోళన వ్యక్తం చేసింది. మెసేజ్ ఎడిటింగ్‌కు సంబంధించిన దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటికే సాంకేతిక మార్పులు చేపడుతున్నట్లు దురోవ్ వెల్లడించారు.
ఎడిట్ చేసిన సందేశాలపై స్పష్టమైన గుర్తింపు కనిపించేలా వ్యవస్థను మరింత పారదర్శకంగా రూపొందిస్తున్నామని తెలిపారు. టెలిగ్రామ్ సేవలు నిలిపివేయడంతో విద్యా సంబంధిత గ్రూపులు, స్టడీ మెటీరియల్స్‌పై ఆధారపడే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే పరీక్షల విశ్వసనీయతను కాపాడటం, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం కోసం ఈ చర్యలు అవసరమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక అసౌకర్యం కలిగినప్పటికీ, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు మరియు లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Reebok : రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం
Apollo Healthtech Shobana Kamineni: అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని
RBI Sovereign Gold Bond: గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టారా? అయితే మీకు జాక్‌పాట్ తగిలినట్లే!
Redmi Turbo 5 Phones: 7540mAh బ్యాటరీతో ‘రెడ్మీ టర్బో 5’ లాంచ్!
Air India, IndiGo: ATF పన్ను పెంపు ప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా?
Today Gold Rate: అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరినా తగ్గని బంగారం ధరలు
KTR Visit Khammam : కాసేపట్లో ఖమ్మంలో కేటీఆర్ పర్యటన గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని