
Today Astrology June 17 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరాభవ నామ సంవత్సరం, జేష్ట మాసం, కృష్ణ పక్షం, ఉత్తరాయణం, 2026 జూన్ 17వ తేదీ బుధవారం. పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి? ఏ రాశులు కొత్త పనులు ప్రారంభించకూడదు?
ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరుల గొడవల్లోకి వెళ్లకుండా ఉండండి. మేష రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది, అయితే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు కుటుంబంలో సఖ్యతను పెంచుకోవాలి, గొడవలకు దూరంగా ఉండాలి.
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున అతిగా ఆలోచించడం తగ్గించుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సింహ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
మకర రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. అయితే మకర రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం
సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)