
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Kishan Reddy vs Revanth Reddy: 'హైదరాబాద్ మెట్రోప్రాజెక్టు విషయంలో అనేక రకాలుగా రేవంత్ రెడ్డి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా నేను తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశా. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నా తప్ప ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు' కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
'హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయంలో రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నాతో, రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తెలిపారు' అని వివరణ ఇచ్చారు.
కేంద్ర మంత్రిగా తెచ్చిన నిధులు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై మరోసారి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి విమర్శలను తిప్పి కొడుతూ తాను కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిన నిధులు, ప్రాజెక్టుల చిట్టాను బహిర్గతం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డి గట్టి బదులు ఇచ్చారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే. 'మెట్రో ఫేజ్-1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు ఇచ్చింది.
మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని మిగిలిన నగరాల్లాగే హైదరాబాద్ విషయంలోనూ సాంకేతికతంగా చర్చించి కేంద్రం సహకరిస్తుంది. అంతే తప్ప కిషన్ రెడ్డి
ఆపమంటే ఆపరు. తెలంగాణ అభివృద్ధిపై మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఈ విషయంలో ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు' అని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
సర్టిఫికెట్లు అవసరం లేదు నాకు, ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లు అవసరం లేదని.. తాను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో మేం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తున్నామని.. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని వెల్లడించారు. 'ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డగా నేను ఉద్యమాలు చేశా. అమరణ నిరాహార దీక్ష చేశా. బిల్లు పాసైన తర్వాతే దీక్ష విరమించా' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
ఎవరి సూచనలు అవసరం లేదు తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో ఎవరి సూచనలు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మించామని.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు ఇలా అనేక అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి విషయంలో అభివృద్ధి పనుల కోసం భూసేకరణ కావాలని అడిగినా రేవంత్ రెడ్డి స్పందించలేదని ఆరోపించారు.
వడ్డీలేని రుణాలు 'ఎంఎంటీఎస్ ఫేజ్-2ను కేంద్ర నిధులతో నిర్మించాం. జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్ వంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా ఎలాంటి వివక్ష లేకుండా తమ సహకారం ఉంటుంది. రేవంత్ రెడ్డివి దిగజారుడు రాజకీయాలు. మేం ఉన్నన్ని రోజులు తెలంగాణ పురోగతికి కట్టుబడి ఉంటాం' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 'రూ.11వేల కోట్ల రుణాలను 50 ఏళ్ల కోసం వడ్డీలేని రుణాలు ఇచ్చింది. మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించాం. ఎస్సీడీసీ కోసం 12 ఏళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు రూ.34 వేల కోట్లను అందించాం' అని వివరించారు.
ఆ సంస్కృతి బీజేపీలో ఉండదు ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బీజేపీలో ఉండవని.. ఏదైనా చెప్పాలనుకుంటే.. ప్రాజెక్టు విషయంలో మార్పులు అవసరమైతే.. ధైర్యంగా చెబుతాం తప్ప.. ఇలా ప్రాజెక్టులను అడ్డుకోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామని.. అందులో సందేహం అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు తీసుకున్న అప్పులను ముందే చెల్లించరు.. మెట్రో ఆదాయంలో.. ఆపరేషన్స్, మెయింటేనెన్స్‌కు ఖర్చు చేయాలని వివరించారు. ఆ తర్వాతే రుణాలు చెల్లించాలని చెప్పారు. ఆరు గ్యారంటీలపై వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 'కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు ఏమయ్యాయి? దాని గురించి ఏనాడూ మాట్లాడటం లేదు ఎందుకు?' అని ప్రశ్నించారు.