
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Cobra Abhishekam Viral Video: హిందువుల మహా భక్తికి హద్దులు ఉండవని అంటూ ఉంటారు. కానీ ఇక్కడొక భక్తరాలు ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి.. శివునిపై ఉన్న భక్తిని చూటుకుంది.
సాధారణంగా పాము కనిపిస్తేనే కాళ్లూ చేతులూ వణికిపోతుతూ ఉంటాయి. అలాంటిది అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు ఓ మహిళ భయపడకుండా అభిషేక్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివలింగంపై నాగుపాము.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడిమో ప్రకారం.. ఒక శివాలయంలోని శివలింగంపై పెద్ద నాగుపాము పడగ విప్పి కూర్చిని ఉంది. అయితే, దాన్ని చూసి భయపడి పారిపోవాల్సింది పోయి..
అక్కడ ఉన్న ఇద్దరు భక్తులు ఆ స్వామికి అభిషేక్ చేయడం ప్రారంభించారు. అయితే, అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.. ఆ ఇద్దరిలో ఒక మహిళా భక్తురాలు ఏకంగా ఈ విషపూరితమైన కోబ్రా పడగను చేతులతో పట్టుకుని ఉండడం మీరు ఈ వీడియో క్లియర్‌గా చూడొచ్చు..
మరో భక్తుడు శివలింగంతో పాటు ఆ నాగుపాము తలపై నీళ్లు పోస్తూ అభిషేకం చేస్తుండగా.. సదరు మహిళ పామును కదలకుండా పట్టుకుని సహకరించడం మీరు ఈ వీడియోలో క్లయర్‌గా చూడొచ్చు.. ఆ పాము కూడా ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వస్తున్నారు. కొంతమంది శివునిపై నమ్మకంతోనే ఆమె అలా చేయగలిగిందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది ఇది భక్తి కాదు, మూఢనమ్మకం.. ప్రాణాలతో చెలగాటం.. అంటూ మరికొందరు మండిపడుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ, ఈ నాగుపాము అభిషేకం వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఈ అరుదైన, ఆశ్చర్యం కలిగించే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను bass.bhaskaran's అనే ఇన్‌స్టా అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో 66 వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. చాలా మంది వీక్షించిన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ