
PM Modi- Trump : ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖిగా కలుసుకోవడం విశేషంగా మారింది.
సదస్సు వేదికపై ఇరు దేశాల అధినేతలు ఎంతో ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సమావేశం ప్రారంభానికి ముందు మోదీ, ట్రంప్ ఆప్యాయంగా కరచాలనం చేసుకుని చిరునవ్వులతో పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ అనంతరం ఇరువురు నేతలు ఇతర ప్రపంచ దేశాల నాయకులతో కలిసి సదస్సులో పాల్గొన్నారు.
వీరిద్దరి కలయిక అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే.. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గత ఏడాది ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ తరువాత వీరిద్దరూ ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి.
ఇటీవల కాలంలో ట్రంప్ టారిఫ్ ల మోత.. పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తరువాత ఇరు దేశాల అధినేతలు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది
PM Modi and Trump interacting at G7 Summit
PM Modi- Trump : ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖిగా కలుసుకోవడం విశేషంగా మారింది. సదస్సు వేదికపై ఇరు దేశాల అధినేతలు ఎంతో ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
సమావేశం ప్రారంభానికి ముందు మోదీ, ట్రంప్ ఆప్యాయంగా కరచాలనం చేసుకుని చిరునవ్వులతో పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ అనంతరం ఇరువురు నేతలు ఇతర ప్రపంచ దేశాల నాయకులతో కలిసి సదస్సులో పాల్గొన్నారు. వీరిద్దరి కలయిక అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎందుకంటే.. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గత ఏడాది ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ తరువాత వీరిద్దరూ ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి. ఇటీవల కాలంలో ట్రంప్ టారిఫ్ ల మోత.. పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తరువాత ఇరు దేశాల అధినేతలు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.