
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని, ‘TCA50 గోల్డెన్ జూబ్లీ వేడుకల’ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకలు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, 50 ఏళ్ల జ్ఞాపకాలు, స్నేహబంధాలు , కమ్యూనిటీ స్ఫూర్తిని చాటిచెప్పే ఒక గొప్ప వారసత్వం అని నిర్వాహకులు పేర్కొన్నారు.
వివరాలు.. ఈ చారిత్రాత్మక వేడుకలు ఆగస్టు 7 , 8, 2026 తేదీలలో హ్యూస్టన్లో జరగనున్నాయి. హ్యూస్టన్ ప్రజలందరినీ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని, చరిత్రను ప్రత్యక్షంగా వీక్షించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం tca50.org లేదా వెబ్సైట్లను సందర్శించవచ్చు, లేదా coreteam@tca50.org కి ఈమెయిల్ చేయవచ్చు
.