
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ ఇంధన మార్కెట్లలో పెను సంచలనం సృష్టించింది. హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం కానుందనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర 4 నుంచి 5 శాతం మేర క్షీణించి బ్యారెల్కు 82-84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 80-81 డాలర్ల మార్కుకు పడిపోయింది.
గత మూడు నెలల్లో చమురు ధరలు ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.అయితే, ధరలు భారీగా తగ్గినప్పటికీ.. ఫిబ్రవరి 2026లో యుద్ధం ప్రారంభం కావడానికి ముందున్న ధరలతో పోలిస్తే ఇవి ఇంకా ఎక్కువే ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 70 డాలర్ల పరిధిలో ఉండేది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో.. ప్రపంచ చమురు సరఫరా నిలిచిపోతుందనే భయంతో ధరలు ఏకంగా 120 డాలర్ల మార్కును దాటి రికార్డు సృష్టించాయి.
ప్రస్తుత శాంతి ఒప్పందంతో ధరలు దిగిరావడం వినియోగదారులకు పెద్ద ఉపశమనంగా మారింది.ఇంకా పొంచి ఉన్న సవాళ్లుజూన్ 20న జెనీవాలో జరగబోయే అధికారిక సంతకాల వేడుక తర్వాత ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుంది. ఈ సానుకూల పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు తగ్గి స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
అయినప్పటికీ
,